E-Paper
Advertisement

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!
Advertisement

Vijay Thalapathy:కోలీవుడ్ దళపతి, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి చిత్రం ‘జన నాయగన్’ ఎట్టకేలకు థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. ఎన్నో సెన్సార్ చిక్కులు, అడ్డంకులు దాటుకుని జూలై 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ “ఐయామ్‌ కమింగ్…” అనే చిన్న షార్ట్ వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. విజయ్ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దళపతి అభిమానుల్లో ఈ గూస్ బంప్స్ మూమెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఆర్నెళ్ల నిరీక్షణ ఫలించింది – అడ్డంకులు దాటిన జన నాయకుడు:

నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే విడుదల కావాల్సింది. అప్పట్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాక కొన్ని ఊహించని రాజకీయ, సెన్సార్ కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా సినిమా ఆలస్యం కావడంతో, అసలు ఈ ప్రాజెక్ట్ వస్తుందా? రాదా? అనే అనుమానాలు వచ్చాయి. కానీ నిర్మాత వెంకట్ కే నారాయణ పట్టు వదలకుండా ఢిల్లీ సెన్సార్ బోర్డు వరకు వెళ్లి పోరాడి, ఎట్టకేలకు అన్ని అడ్డంకులను తొలగించారు. దాదాపు ఆరు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘జన నాయగన్’ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు.

నెట్టింట వైరల్ అవుతున్న “ఐయామ్‌ కమింగ్” డైలాగ్:

Advertisement

హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే , మమిత బైజు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా తాజాగా జననాయగన్ మూవీ నుండి అంటూ వైరల్ అవుతున్న ఈ షార్ట్ లో.. గతంలో బాగా పాపులర్ అయిన “ఐయామ్‌ కమింగ్” అనే డైలాగ్‌తో విడుదలైన షార్ట్ ప్రోమో వీడియోలో.. రాజకీయ నాయకుల పాత్రధారులను ఒక గదిలో బంధించి, వారిపై కొరడా ఝుళిపైస్తూ.. ” ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే..నాశనం చేయడానికి, దోచుకోవడానికారా రాజకీయాల్లోకి వచ్చేది అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో పూనకాలు తెప్పిస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో “చెప్పినట్టే వచ్చాడు.. రియల్ లైఫ్‌లో సీఎం అయ్యాడు.. ఇప్పుడు థియేటర్లలో జన నాయకుడిగా విశ్వరూపం చూపించబోతున్నాడు” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇక వన్ లాస్ట్ టైమ్ అంటూ విజయ్‌ను వెండితెరపై సెలబ్రేట్ చేసుకోవడానికి థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాల్లాంటి ఏర్పాట్లు అప్పుడే షురూ అయ్యాయి.

also read:ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

ఆలస్యం ప్లస్సా.. మైనస్సా? క్రేజ్ ఎలా ఉంది?:

Advertisement

ఇక విజయ్ కి ఇదే చివరి సినిమా కావడం వల్ల ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఏమాత్రం పని చేయదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు కీలక పాత్రలో మెరిసింది. ఇక కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త ఓపెనింగ్స్ రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఒక నటుడిగా కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకుని, ఇప్పుడు రాజకీయాల్లో జన నాయకుడిగా మారిన విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎమోషన్‌ను క్రియేట్ చేయనుంది. ఇక ఎన్నో అవాంతరాలను దాటుకుని జూలై 23న థియేటర్లలోకి వస్తున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా, అంచనాలను అందుకొని విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఎండ్ నోట్‌గా నిలుస్తుందో లేదో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×