NBK111 Update : ‘వీరసింహారెడ్డి’… గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2023 జనవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఇక మళ్ళీ ఇదే కాంబోలో సినిమా అంటే తెలుగు సినిమా ప్రేక్షకుల్లో, ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో ఒక రేంజ్ పూనకాలు వస్తాయని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో హై-వోల్టేజ్ యాక్షన్, సిస్టర్ సెంటిమెంట్‌తో థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ క్రేజీ కాంబో, ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతానికి ‘NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ముంబైలో భారీ యాక్షన్ షెడ్యూల్
ప్రస్తుతం ముంబైలోని కీలక ప్రాంతాలలో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన మేకర్స్ షూటింగ్ ని యమా జోరుగా కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది, బాలయ్య మార్క్ ఊరమాస్ ఎలిమెంట్స్‌కు ముంబై అండర్ వరల్డ్ లేదా అక్కడి పవర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్ తోడైతే స్క్రీన్ ఏ రేంజ్‌లో బద్దలవుతుందో ఊహించుకుంటుంటేనే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వస్తున్నాయి.
సరిగ్గా ఈ సమయంలోనే నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.యస్ …జూన్ 10న రాబోయే బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ సర్ప్రైజ్ ట్రీట్ రెడీ అవుతోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ బర్త్‌డే వేడుకలను మరింత గ్రాండ్‌గా మార్చేందుకు, ఈ చిత్రం నుండి ఒక పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.
‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’
ఇక ఈ అప్‌డేట్ కోసం విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తేనే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆ పోస్టర్‌పై ఉన్న ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’ అనే క్యాప్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా బాలయ్య సినిమాల్లో వింటేజ్ లుక్స్, పాతకాలపు ఫ్యాక్షన్ పగలు ఆశించడం సహజం. కానీ గోపీచంద్ మలినేని ఈసారి రూట్ మార్చాడు. బాలకృష్ణను ఇప్పటివరకు ఎన్నడూ చూడని ఒక సరికొత్త మోడ్రన్, న్యూ ఏజ్ ఊరమాస్ అవతారంలో ప్రెజెంట్ చేయబోతున్నట్లు ఈ క్యాప్షన్ ద్వారా గట్టి హింట్ ఇచ్చాడు. ఈ నెవర్ బిఫోర్ లుక్ ఎలా ఉండబోతుందా అని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది కూడా.
పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న మంచు మనోజ్
ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా ..ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడు, విలక్షణ నటుడు మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల మే 20న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. మనోజ్ కెరీర్‌లో ఇదొక మైల్‌స్టోన్ క్యారెక్టర్ అవుతుందని, బాలయ్యతో ఆయన తలపడే సీన్లు థియేటర్లలో మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. మాస్ పల్స్ పక్కాగా తెలిసిన గోపీచంద్ మలినేని, గతంలో ‘క్రాక్’, ‘బలుపు’ వంటి సినిమాలతో మాస్ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకున్నాడో ఈసారి అంతకు మించి బాలయ్య ఇమేజ్‌కు సరిపోయేలా హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, సాలిడ్ ఎమోషన్స్‌తో ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని ఇన్ సైడ్ టాక్ .
చూడాలి మరి అభిమానులని ఒక రేంజ్ లో ఊరిస్తున్న ఈ అప్ డేట్ జూన్ 10న ఎలాంటి సంచలనాలకి నాంది పలుకుతుందో !
also read :‘ది జర్నీ ఆఫ్ పెద్ది’ వీడియోతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న గ్లోబల్ స్టార్!