E-Paper
Advertisement

టాటా సఫారీ EV టెస్టింగ్ స్పై షాట్స్ లీక్.. మహీంద్రా XEV 9eకి షాక్ తప్పదా?

టాటా సఫారీ EV టెస్టింగ్ స్పై షాట్స్ లీక్.. మహీంద్రా XEV 9eకి షాక్ తప్పదా?
Advertisement

Tata Safari EV Testing Begins: టాటా మోటార్స్ నుంచి త్వరలో రానున్న సఫారీ ఈవీ భారత రోడ్లపై తొలిసారిగా టెస్టింగ్ సమయంలో కనిపించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సఫారీ ఎస్‌యూవీకి ఎలక్ట్రిక్ వెర్షన్‌ గా ఈ మోడల్ రానుంది. విడుదలకు ముందే బయటకు వచ్చిన స్పై షాట్స్ ఈ వెహికల్స్ కు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించాయి.

స్పైషాట్స్ ఏం చెప్తున్నాయంటే?

టెస్టింగ్ సందర్భంగా బయటకు వచ్చిన ఫోటోలను పరిశీలిస్తే, సఫారీ ఈవీ రూపురేఖలు ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న డీజిల్ సఫారీని పోలి ఉన్నాయి. అయితే, వెనుక భాగంలో ఎగ్జాస్ట్ పైప్ లేకపోవడం, కొత్త రియర్ సస్పెన్షన్ సెటప్ కనిపించడం వల్ల ఇది ఎలక్ట్రిక్ మోడల్ అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా హారియర్ ఈవీలో ఉపయోగిస్తున్న మల్టీ లింక్ రియర్ సస్పెన్షన్‌ ను ఇందులో కూడా అమర్చినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, టెస్ట్ వెహికల్ లో సైడ్ స్టెప్ కనిపించింది. ప్రస్తుతం ఉన్న సఫారీ డీజిల్ మోడల్‌ లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. దీంతో ఎలక్ట్రిక్ వెర్షన్‌ లో ప్రయాణికుల సౌకర్యం కోసం కొన్ని అదనపు ఫీచర్లను టాటా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కొత్త Acti.ev+ ప్లాట్‌ ఫారమ్‌ పై డెవలప్

Advertisement

సఫారీ ఈవీని టాటా కొత్త Acti.ev+ ప్లాట్‌ ఫారమ్‌ పై అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇదే ప్లాట్‌ ఫారమ్‌ పై హారియర్ ఈవీ కూడా రెడీ అవుతోంది. అందువల్ల రెండు వాహనాల మధ్య  టెక్నికల్ విషయాలు ఒకేలా ఉండనున్నాయి. ఇంటీరియర్ విషయంలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా ప్రత్యేక క్యాబిన్ థీమ్, కొత్త సాఫ్ట్‌ వేర్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. టాటా TiDAL డిజిటల్ ఆర్కిటెక్చర్ ఇందులో అందుబాటులోకి రావచ్చు. దీని ద్వారా ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌ డేట్స్, ఆటో పార్క్ అసిస్ట్, సమ్మన్ మోడ్, లో స్పీడ్ క్రూయిజ్ కంట్రోల్, యూపీఐ ఆధారిత ఇన్ కార్ పేమెంట్ సిస్టమ్, 540 డిగ్రీల కెమెరా లాంటి ఆధునిక ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

పవర్ ట్రెయిన్ గురించి..

సఫారీ ఈవీలో హారియర్ ఈవీ మాదిరిగానే 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే రియర్ వీల్ డ్రైవ్ (RWD), డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్లు కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. హారియర్ ఈవీ RWD వెర్షన్ 238 హెచ్‌పీ  వపర్ ను ఉత్పత్తి చేస్తుంది. AWD వేరియంట్‌ లో అదనపు మోటార్ కారణంగా మరింత శక్తి లభిస్తుంది. ఇదే సెటప్‌ ను సఫారీ ఈవీలో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. సఫారీ పరిమాణం, బరువు ఎక్కువగా ఉండటం వల్ల హారియర్ ఈవీతో పోలిస్తే రేంజ్ కొంత తక్కువగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ధర గురించి..

Advertisement

ధర విషయానికి వస్తే, టాటా సఫారీ ఈవీ ప్రారంభ ధర సుమారు రూ.22.5 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది పండుగ సీజన్‌ లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురావాలని టాటా మోటార్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విడుదలైన తర్వాత టాటా బ్రాండ్‌లో అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలవడంతో పాటు, మహీంద్రా XEV 9e లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also:జూన్ 5న విన్‌ ఫాస్ట్ ట్యాక్సీ సర్వీసులు షురూ.. ఉబెర్, ఓలాకు తలనొప్పి తప్పదా?

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×