E-Paper
Advertisement

NBK111: ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా.. బాలయ్య రౌద్రరూపం.. సోషల్ మీడియా షేక్!

NBK111: ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా.. బాలయ్య రౌద్రరూపం.. సోషల్ మీడియా షేక్!
Advertisement

NBK111 Glimpse: నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ అనగానే టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ (2023 జనవరి 12న విడుదల) బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి, అంతకుమించిన హై వోల్టేజ్ యాక్షన్‌ను వెండితెరపై ఆవిష్కరించడానికి ఈ క్రేజీ కాంబో మళ్లీ జతకట్టింది.

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన #NBK111 గ్లింప్స్ – ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అసలు సిసలైన నందమూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ గ్లింప్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ వ్యూస్ పరంగా రికార్డులు తిరగరాస్తోంది.

Advertisement

అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న యాక్షన్ గ్లింప్స్

వదిలిన ఈ చిన్న గ్లిప్స్ బాలకృష్ణ ఎనర్జీ, ఆయన మేకోవర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఒక పవర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో, గోపీచంద్ మలినేని మార్క్ టేకింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా బాలయ్య సినిమా గ్లింప్స్ అంటేనే డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఈ గ్లింప్స్‌లో కూడా బాలకృష్ణ చేసిన యాక్షన్ సీక్వెన్స్

Advertisement

చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయమనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన నడిచి వస్తున్న తీరు, కళ్లలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ నందమూరి అభిమానులకు మాంచి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.. అఖండ’, ‘భగవంత్ కేసరి’ వీరసింహ రెడ్డి,అఖండ 2 వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న బాలయ్య, ఈ సరికొత్త లుక్‌లో మరింత యంగ్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ బాక్సాఫీస్ వేటను అప్పుడే మొదలుపెట్టినట్టు హింట్ ఇచ్చేసినట్టే కనిపిస్తుంది.

గ్లింప్స్ ని మరో లెవెల్ కి తీసికెళ్ళిన తమన్ 

ఈ చిత్రానికి మరో మెయిన్ ఎసెట్ సంగీత దర్శకుడు థమన్ ఎస్. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా విజయాల్లో ఎంత కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు #NBK111 గ్లింప్స్ కోసం కూడా థమన్ తన మార్క్ రీ-రికార్డింగ్‌తో థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను గుర్తుచేశారు. గ్లింప్స్ ప్రారంభం నుండి ముగింపు వరకు వచ్చే ప్రతి బీట్ నెక్స్ట్ లెవెల్ . బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్‌కు థమన్ ఇచ్చిన బేస్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ ఈ వీడియోను లూప్‌లో చూసేలా చేస్తున్నాయి.

ఇక గోపీచంద్ మలినేని గతంలో ‘క్రాక్’ (2021 జనవరి 9) చిత్రంతో మాస్ పల్స్ ఏంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత బాలయ్యతో చేసిన ‘వీరసింహారెడ్డి’తో కమర్షియల్ సక్సెస్ ఫార్ములాను నూటికి నూరు పాళ్లు పండించారు. ఇప్పుడు #NBK111 విషయంలో కూడా ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, బాలయ్య ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయే పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేసినట్టు ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది. నిర్మాతలు కూడా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్స్ చూస్తుంటేనే సినిమా నిర్మాణ విలువలు ఎంత గ్రాండ్‌గా ఉన్నాయో అర్థమవుతోంది.

ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడతాయో

ప్రస్తుతం ఈ ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది. ఇక ఈ గ్లింప్స్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ చిత్రం రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి రాబోయే టీజర్, ట్రైలర్, పాటలు ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడతాయో చూడాలి.

also read :‘రాకా’ కోసం వెయిటింగ్…బన్నీ ట్వీట్‌కు చరణ్ క్రేజీ రిప్లై!

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×