E-Paper
Advertisement

‘రాకా’ కోసం వెయిటింగ్…బన్నీ ట్వీట్‌కు చరణ్ క్రేజీ రిప్లై!

‘రాకా’ కోసం వెయిటింగ్…బన్నీ ట్వీట్‌కు చరణ్ క్రేజీ రిప్లై!
Advertisement

Ram Charan’s Reply to Allu Arjun: బాక్సాఫీస్ వద్ద ఎన్ని కాంట్రవర్సీలు చుట్టూముట్టినా వాటన్నింటినీ దాటుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘పెద్ది’. థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తున్న సమయంలో, దీనిపై వస్తున్న ప్రశంసలు కూడా అదే రేంజ్ లో కనిపిస్తున్నాయి.ఇక ఇలాంటి సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా చేసిన చేసిన పోస్ట్ కి రిప్లయ్ కి చరణ్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది.

చరణ్ స్క్రీన్ మీద అరాచకం సృష్టించాడన్న బన్నీ

విషయంలోకి వెళ్తే జూన్ 4న థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చి సాలిడ్ వసూల్లని కొల్లగొడుతున్న సమయంలో స్వయంగా ఐకాన్ స్టార్ బన్నీ ఈ సినిమా పై రియాక్ట్ అవుతూ ‘పెద్ది’ సినిమాలో చెర్రీ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉందంటూ ఆకాశానికెత్తేశారు. ముఖ్యంగా పెద్ది పాత్రలో చరణ్ చూపించిన ఇంటెన్సిటీ, ఎమోషన్స్‌ను పండించిన తీరు ఎంతో సహజంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఈ పాత్ర కోసం చరణ్ మేకోవర్ అయిన విధానం, బాడీ లాంగ్వేజ్, ఆ అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ స్క్రీన్ మీద అరాచకం సృష్టించాయని బన్నీ తన పోస్ట్ లో చెప్పుకొచ్చిన సంగతి తెల్సిందే.

Advertisement


also read :తొలిసారి పెదవి విప్పిన మెగా కూతురు శ్రీజ.. ఎమోషనల్ వీడియో వైరల్!

థ్యాంక్యూ బన్నీ.. అంటూ రిప్లయ్ ఇచ్చిన చరణ్ 

అయితే తాజాగా ఇదే పోస్ట్ పై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు రామ్ చరణ్. “థ్యాంక్యూ బన్నీ.. మీ విషెస్ మాకు, మా పెద్ది టీమ్ అందరికీ ఎంతో ప్రత్యేకం. లాట్స్ ఆఫ్ లవ్. ఇక రాకా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం” అంటూ చెర్రీ లవ్లీ రిప్లై ఇచ్చారు.మొత్తంగా బన్నీపెట్టిన పోస్ట్‌కు రామ్ చరణ్ నుంచి వచ్చిన రిప్లై కూడా అంతే రేంజ్‌లో వైరల్ అవుతోంది.ఇక ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాస్తూ సరికొత్త రికార్డులని తన పేరున లిఖించే పనుల్లో పడింది. వివాదాలు ఎంత పెరిగితే కలెక్షన్లు అంతగా దూసుకుపోతుండటం విశేషం.

Advertisement

ఈ విజయం టాలీవుడ్ స్థాయిని ప్యాన్ వరల్డ్ రేంజ్ కి తీసికెళ్ళగా , అల్లు అర్జున్-రామ్ చరణ్ మధ్య జరిగిన ఈ క్రేజీ సంభాషణ నెట్టింట సరికొత్త ట్రెండ్‌ సెట్ చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం. ఏది ఏమైనా రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది అనుకుంటున్న ఈ సమయంలో ఇద్దరి మధ్య ఇలా క్రేజీ డిస్కషన్ జరగడం ఇండస్ట్రీకి మంచిదనే చెప్పాలి.
also read :వారణాసి’ తర్వాత బుచ్చిబాబుతో మహేష్ బాబు సినిమా?.. అదయ్యేపనేనా?

Related News

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

ఇరుముడి ఊచకోత.. ఇప్పటివరకు వచ్చింది ఎంతో తెలుసా ?

ఫైనల్లీ వైష్ణవి చైతన్యతో రిలేషన్ పై ఆనంద్ క్లారిటీ.. అన్న వదిననే ఫాలో అవుతున్నాడుగా?

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×