E-Paper
Advertisement

Neena Gupta: డైరెక్టర్ అసభ్య ప్రవర్తన..డబ్బు కోసమే భరించానంటూ నటి ఎమోషనల్..

Neena Gupta: డైరెక్టర్ అసభ్య ప్రవర్తన..డబ్బు కోసమే భరించానంటూ నటి ఎమోషనల్..
Advertisement

Neena Gupta: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఒకానొక సమయంలో దర్శకులు నుంచి లేదా నిర్మాతల నుంచి తోటి నటినటుల నుంచి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు.అయితే ఈ పరిస్థితులను పలువురు సెలబ్రిటీలు బహిరంగంగా బయట పెడుతూ ఉంటారు. మరి కొంతమంది ఇలాంటి విషయాలను బయట చెబితే అవకాశాలు రావు అంటూ వారు ఎదుర్కొన్న ఇబ్బందులను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అయితే తాజాగా సీనియర్ నటి నీనా గుప్తా(Neena Gupta) సైతం ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కెరియర్లో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి బయటపెట్టారు. నీనా గుప్తా సీనియర్ నటిగా వెండితెరపై బుల్లితెరపై నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.

నీనా గుప్త తెలుగు సినిమాలు…

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించిన ఈమె తెలుగులో కూడా ఇష్క్, డయల్ 100, గుడ్ బాయ్ వంటి సినిమాలలో నటించారు. ఇలా పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో మాత్రమే కాకుండా ఈమె టీవీ సీరియల్స్ ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా నీనా గుప్తా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.

డబ్బు కోసమే అవమానాలు భరించా…

Advertisement

తాను సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సమయంలో కొంతమంది దర్శకులు చాలా అసభ్యకరమైన పదాలతో తిట్టారని ఈమె తెలియజేశారు. షూటింగ్ సెట్లో అందరి ముందు ఇలా తిట్టడంతో ఎంతో అవమానకరంగా భావించానని తెలియజేశారు. ఎలాంటి కారణం లేకుండా అసభ్య పదాలతో తిట్టేవారు అలాంటప్పుడు ఆ సినిమా సెట్ నుంచి వెళ్లిపోదామా అనే భావన ఉండేది కానీ అప్పట్లో నా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డబ్బు కోసమే ఇలాంటి అవమానాలను ఎదుర్కొంటూ సినిమాలలో నటించానని తెలిపారు.

సినిమాలు విడుదల కాకుంటే బాగుండు..

Advertisement

ఒకవేళ ఆ సమయంలో వేరే సినిమాలలో అవకాశం కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాలలో నటించేదాన్ని కాదు. ఇక కథల ఎంపిక విషయంలో కూడా తాను తడబడ్డానని నీనా గుప్తా తెలిపారు. తాను నటించిన కొన్ని సినిమాలలో పాత్రల విషయంలో చాలా బాధపడ్డాను ఆ సినిమాలు విడుదల కాకపోతే బాగుండేది అంటూ తాను ఎన్నో సందర్భాలలో దేవుని కోరుకున్నానని తెలియజేశారు. ఇలా కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఇబ్బందులను తాను ఎదుర్కొంటు సినిమాలలో నటించాను అంటే కేవలం ఆర్థికపరమైన ఇబ్బందులు కారణమని డబ్బు కోసమే వీటిని భరించానని తెలియజేశారు.

Also Read: Arjun sarja: విశ్వక్ సేన్ తో గొడవ.. సీతా పయనం సినిమాపై క్లారిటీ ఇచ్చిన అర్జున్ సర్జా!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×