Divya Bharathi (Image credit: Instagram)
దివ్యభారతి.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సరసన బ్యాచిలర్ చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు , తమిళ్ ప్రేక్షకులకు దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ.

Divya Bharathi (Image credit: Instagram)
1992 జనవరి 28న తమిళనాడులోని కోయంబత్తూర్ లో జన్మించిన ఈమె ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టింది.

Divya Bharathi (Image credit: Instagram)
ఈమె 2015లో మిస్ ఎత్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్, 2016లో న్యూ ఫేస్ మోడల్, క్రౌన్డ్ ప్రిన్సెస్ సహా ఎన్నో టైటిల్స్ ను సొంతం చేసుకుంది.

Divya Bharathi (Image credit: Instagram)
ప్రస్తుతం సుడిగాలి సుదీర్ హీరోగా నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే చిత్రం ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉండగా ఇటీవల అల్లు అర్జున్తో కలిసి ఒక ఫోటో పంచుకున్న ఈమె ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది.

Divya Bharathi (Image credit: Instagram)
పైగా అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ఒక పాత్రలో నటించబోతోంది అంటూ వార్తలు కూడా వచ్చేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది.

Divya Bharathi (Image credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ చుడీదార్ ధరించి చాలా సింపుల్ లుక్ లో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం దివ్య భారతి షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి.