E-Paper
Advertisement

Netflix Pandaga 2026: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ప్యారడైజ్ వరకు.. నెట్ ఫ్లిక్ లో రానున్న సినిమాలు ఇవే..!

Netflix Pandaga 2026: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ప్యారడైజ్ వరకు.. నెట్ ఫ్లిక్ లో రానున్న సినిమాలు ఇవే..!
Advertisement

Netflix Pandaga 2026: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ 2026 సంవత్సరానికి సంబంధించిన తెలుగు సినిమాల జాబితాను నెట్‌ఫ్లిక్స్ పండగ 2026 పేరుతో అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చే పలు భారీ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో ఈ లైనప్‌పై మంచి ఆసక్తి నెలకొంది.

 

Advertisement

ఈ జాబితాలో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కలయిక కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

 

నాని ప్యారడైజ్ నెట్ ఫ్లిక్స్ లో..

Advertisement

 

అలాగే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పరడైజ్ కూడా ఈ లైనప్‌లో ఉంది. దసరా సినిమాతో మంచి విజయం సాధించిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో నాని పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా కూడా థియేటర్ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

 

మరో ఆసక్తికర చిత్రం ఆకాశంలో ఒక తార. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భావోద్వేగాలతో కూడిన ప్రయాణ కథగా ఉండనుంది. ఈ చిత్రం కూడా అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

 

ఇక సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన చాంపియన్ కూడా నెట్‌ఫ్లిక్స్‌కు రాబోతోంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ సినిమా ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

 

నెట్ ఫ్లిక్స్ లో మలయాళ సినిమాల హవా..

 

అలాగే మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విభిన్నమైన కథతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.

 

మొత్తం పైన.. నెట్‌ఫ్లిక్స్ పండగ 2026 తెలుగు సినిమాల లైనప్ ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించబోతోంది. థియేటర్ల తర్వాత ఈ సినిమాలను ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Netflix : 2026 నెట్‌ఫ్లిక్స్ లో దుమ్మురేపుతున్న సినిమాలు, సిరీసులు ఇవే… ఒక్కో భాష నుంచి ఒక్కో మూవీ

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×