Samantha:సమంత (Samantha).. స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో ప్రతి విషయాన్ని స్టడీ చేసి.. తనకంటూ ఒక క్యాపబిలిటీని ఏర్పరచుకుంది. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న పనులు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా మనం ఎక్కడ ఉన్నాము? ఏం చేస్తున్నాము? ఏం చేస్తే ఏం జరుగుతుంది? అనే సామాజిక స్పృహ లేకుండా సమంత వ్యవహరిస్తోందనే వార్తలు నెటిజన్స్ నుంచి చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు సమంత ఎఫైర్ రూమర్స్.. ఏదైనా సంబంధం కొనసాగించాలి అంటే ఆ సంబంధం ఆరోగ్యకరంగా ఉండాలి. కానీ ఇలా ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్న వారి జీవితంలోకి ప్రవేశించి, ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టి వేయకూడదు అని కూడా సలహా ఇస్తున్నారు.
సమంత విషయంలో సింపథీ వర్కౌట్ కాలేదా?
అసలు విషయంలోకి వెళ్తే.. సమంత – నాగచైతన్య (Naga Chaitanya) నుండి విడిపోయిన తర్వాత ఏదో ఒక విషయంలో నాగచైతన్యను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అటు నాగచైతన్య మాత్రం సమంత గురించి ఒక్క విషయంలో కూడా ప్రస్తావించలేదు. కానీ సమంత మాత్రం తాను ఎక్కడ పాల్గొన్నా.. ఎక్కడ మీడియా ముందు కనిపించినా సరే.. నాగచైతన్య పై ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేస్తూనే వచ్చింది. దీనికి తోడు “అమ్మ చెప్పింది” అంటూ ఏవేవో పోస్ట్లు పెట్టి, సింపథీ పొందాలని చూసింది కానీ అది వర్కౌట్ కాలేదు. దీనికి తోడు మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. కనీసం అక్కడ నుంచైనా తన జీవితాన్ని మరో కొత్తగా ప్రారంభిస్తుంది అనుకుంటే చెత్తగా ప్రారంభించింది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లయిన వాడితో సమంత ఎఫైర్.. ఎంతవరకు కరెక్ట్?
కమ్ బ్యాక్ లో ‘సిటాడెల్’ లాంటి వెబ్ సిరీస్లో తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు ఎదుర్కొంటుంది. దీనికి తోడు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించిన దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఈమె ఎఫైర్ పెట్టుకోవడమే ఆశ్చర్యకరం. వాస్తవానికి ఈమె అతడితో ఎఫైర్ పెట్టుకోవడం అనేది.. అతడికి వివాహం కాకుండా ఉండుంటే.. లేదా వివాహం జరిగి తన భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉండుంటే.. అతడితో ఇలాంటి రిలేషన్ కొనసాగించడం సరైనదే అని.. కానీ రాజ్ కి భార్య ఉంది. పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి అతనితో ఈమె సంబంధాలు కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్.. ఈమె చేసే పని వారి జీవితాలను అఘాతంలోకి నెట్టివేయడం లాంటిది కాదా? అంటూ పలు రకాల ప్రశ్నలతో సమంతాపై విమర్శలు గుప్పిస్తున్నారు.
దిక్కుమాలిన సంబంధాలతో జీవితం కొనసాగిస్తుందా?
ఇక్కడ కులమతాలతో ప్రస్తావన లేదు. ఒక మనిషి అన్న తర్వాత మనం చేసే పనులు ఇతరులను బాధించకూడదు అని అర్థం చేసుకోవాలి. అటు రాజ్ కూడా స్టార్ హీరోయిన్ దొరికింది.. పైగా ఆమె బాగా సంపాదించింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. తననే నమ్ముకుని భార్యా పిల్లలు ఉన్నారు అన్న విషయాన్ని మరిచిపోయి ఎంజాయ్ చేద్దామనుకుంటే.. కెరియర్ పరంగా విజయం సాధిస్తారేమో కానీ వ్యక్తిగతంగా విజయం అందుకోలేరు అనే విషయాన్ని రాజ్ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం ఏ స్థానంలో ఉన్నాము అనే విషయాన్ని గ్రహించి.. మానవ సంబంధాల విషయంలో ఒక స్పష్టతతో ఉంటే ఆరోగ్యకరమైన అనుబంధాలతో జీవించడం సాధ్యమవుతుంది. ఇక అలాకాకుండా అనారోగ్యకర సంబంధాలతో జీవిస్తే సమాజం నుంచి బహిష్కరణకు గురి కావాల్సి వస్తుంది అనే విషయాన్ని సమంత , రాజ్ కూడా గ్రహించాల్సి ఉంటుంది అని నెటిజన్స్ ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. సమంత ఇలాంటి దిక్కుమాలిన ఎఫైర్స్ పెట్టుకోవడం అవసరమా? జీవితంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి కానీ.. అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Lavanya Drugs Supply: లావణ్య చీకటి దందా… వ్యవహారం అంతా కోడ్ భాషలోనే