NRI – Pirated IPTV: ఛానెళ్లు, ఓటీటీలు, సినిమాలు, సిరీస్‌లు, స్పోర్ట్స్.. ఇలా దేనినీ వదల్లేదు. వేరే వాళ్ల కంటెంట్‌ని.. తమ కంటెంట్‌గా చెప్పుకుంటూ.. కెనడా, అమెరికా మార్కెట్‌లో అడ్డగోలుగా అమ్మేశాడు. ఈ లేటెస్ట్ ఐపీటీవీ స్కామ్‌తో.. ఎన్ఆర్ఐలు చిక్కుల్లో పడతారనే టాక్.. టెన్షన్ పుట్టిస్తోంది. అసలేంటీ.. ఐపీటీవీ వ్యవహారం? ఇక్కడి కంటెంట్‌ని.. అక్కడెలా క్యాష్ చేసుకుంటున్నారు?
అమెరికా, కెనడాలో హాట్ టాపిక్‌గా ఐపీటీవీ స్కామ్
అమెరికా, కెనడాలో.. కొత్త దందా మొదలైంది. అదే.. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ స్కామ్. సింపుల్‌గా.. ఐపీటీవీ. ఇండియాలోని ఛానెళ్లు, ఓటీటీ కంటెంట్ తక్కువ ధరకే ఇస్తామంటూ.. కొన్ని ఐపీటీవీలు ఎన్ఆర్ఐలకు గాలం వేస్తున్నాయి. వారి మాటలు నమ్మి.. చాలా మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. కానీ.. అదే ఇప్పుడు వారి కొంప ముంచుతుందనే చర్చ జరుగుతోంది. భారత్‌కు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ ఛానళ్లు, లైవ్ టీవీలతో పాటు అమెరికన్ ఛానెళ్ల కంటెంట్‌ను తస్కరించి.. అక్రమంగా ఐపీటీవీలు నెలకొల్పి విక్రయిస్తున్న.. హర్‌ప్రీత్ సింగ్ రణ్‌ధవా కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల అతని ఆఫీసులో చేసిన దాడుల్లో లభ్యమైన ల్యాప్‌టాప్‌లో.. కెనడా, యూఎస్‌కి చెందిన కస్టమర్ల వివరాలు, ఆర్థిక లావాదేవీలు బయటపడ్డాయి.
కంటెంట్ పైరసీతో కోట్లు గడించిన ఐపీటీవీ మాఫియా
కెనడాలో నివాసముంటున్న హర్‌ప్రీత్ సింగ్.. అక్కడి భారతీయులకు ఇండియన్ కంటెంట్‌పై ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకుంటున్నాడు. ఫరీదాబాద్, ఢిల్లీలో సర్వర్లని ఏర్పాటు చేశాడు. అనధికారికంగా కంటెంట్ తస్కరించి.. తమ సొంత కంటెంట్‌గా చెప్పుకుంటూ కోట్లు సంపాదించాడు. ఇండియాలోని కీలక ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సహా ఇతర ఛానెళ్లను.. అక్రమంగా తన ఐపీటీవీలోకి రూట్ చేసుకుంటున్నాడు. వీటిలో పాపులర్ ఛానెళ్లతో పాటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ఉన్నాయి. కెనడాలోనూ ఓ సర్వర్ నెలకొల్పి.. తక్కువ ధరలో సర్వీస్ ఇస్తామంటూ ఆఫర్లు ఇచ్చాడు.
ఐపీటీవీ స్కామ్‌పై భారత్‌లో మొదలైన దర్యాప్తు
ఇక్కడి కంటెంట్‌ని.. ఇండియన్ ఐపీటీవీ, గురు, తషాన్, వోయిస్, పంజాబీ, ఎడ్మంటన్ ఐపీటీవీ, బాస్ ఎంటర్‌టైన్‌మెంట్, అల్ట్రాస్ట్రీమ్ టీవీల పేరుతో.. చైనా నుంచి సెట్ టాప్ బాక్సులు దిగుమతి చేసుకొని.. వాటిలో సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేసి.. కస్టమర్లకు అమ్మేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే.. భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. పోలీసులు కూడా హర్ ప్రీత్ సింగ్ కార్యాలయంలో సోదాలు చేసి 13 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధం ఉన్న కొందరిని అరెస్ట్ చేశారు. పాపులర్ చానెళ్ల కంటెంట్‌ని పైరసీ చేయడం వల్ల.. ఏడాదికి 300 మిలియన్ డాలర్లకు పైనే నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు.
అసలేంటీ.. ఐపీటీవీ వ్యవహారం?
అయితే.. తక్కువ ధరకే ఎక్కువ కంటెంట్ చూడొచ్చనే లెక్కల్లో.. ఈ ఐపీటీవీల గాలానికి చిక్కితే.. ఎన్ఆర్ఐలు చిక్కుల్లో పడే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు పెన్సిల్వేనియా మిడిల్ డిస్ట్రిక్ కోర్టులోని దీనిపై పిల్ దాఖలైంది. దీనిపై.. దర్యాప్తునకు ఆదేశిస్తే.. ఈ ఐపీటీవీల సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు కూడా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. వారు కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. కెనడా, యూఎస్‌లో సుమారు 3 లక్షల మంది.. హర్‌ప్రీత్ సింగ్ ఐపీటీవీ కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించారు.
Also Read: జస్ట్ రూ. 60 వేలకే ఐఫోన్ 16.. ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే ఆఫర్!
అందువల్ల.. లైసెన్స్ కలిగిన ఐపీటీవీ, బ్రాడ్ బ్యాండ్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారానే కంటెంట్ చూడటం బెటర్ అంటున్నారు. యప్ టీవీ లాంటివి.. తెలుగు సహా 8 భాషల్లో లీగల్ కంటెంట్‌ని అందిస్తున్నాయి. ఇవి కాకుండా తక్కువ ధరకే వస్తున్నాయని సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే.. దేశం కాని దేశంలో న్యాయపరమైన చిక్కుల్లో పడొచ్చంటున్నారు. అమెరికా, కెనడాలో ఈ ఐపీటీవీ స్కామ్‌పై దర్యాప్తు మొదలవకముందే.. సబ్‌స్క్రిప్షన్ రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు.