Lavanya Drugs Supply: రాజ్ తరుణ్(Raj Tarum) ప్రియురాలు లావణ్య చీకటి దందాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే రాజ్ తరుణ్ వ్యవహారంలో లావణ్య అడ్డంగా ఇరుక్కుంది.రాజ్ తరుణ్, లావణ్య ఇద్దరు కలిసి ఓ విల్లా(Villa) కొనుక్కున్నామని చెప్పారు. ఇన్ని రోజులు లావణ్య అదే విల్లాలో ఉంది.కానీ కట్ చేస్తే.. ఆ విల్లా విషయంలో కోర్టు లావణ్య కు పెద్ద షాక్ ఇచ్చి.. నువ్వు డబ్బులు సగం ఇచ్చినట్టు డాక్యుమెంట్లలో ఎక్కడా కూడా లేదు అని,వెంటనే ఆ ఇంటి నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని షాక్ ఇచ్చారు. దీంతో లావణ్య కి విల్లా విషయంలో పెద్ద షాక్ తగిలింది. తాజాగా లావణ్య కు మరో పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే..లావణ్య కు సంబంధించి ఒక సంచలన వీడియో, ఆడియో కాల్ రెండూ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు లావణ్య గుట్టు రట్టు అయిందని మాట్లాడుకుంటున్నారు.
లావణ్య చీకటి దందా గుట్టు రట్టు..
లావణ్య ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటుంది అనే ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు డ్రగ్స్ కేసులో లావణ్య అడ్డంగా బుక్ అయింది కూడా..అయితే తాజాగా డ్రగ్స్ విషయంలో లావణ్య కు సంబంధించిన ఒక వీడియో,ఆడియో కాల్ రెండు లీక్ అయ్యాయి.ఇక అందులో లావణ్య (lavanya)డ్రగ్స్ ప్యాకెట్ ని పట్టుకొని అలా వీడియోలో చూపిస్తూ కనిపిస్తోంది. అందులో ఇడ్లీ కింద పెట్టు,లేకపోతే కళ్ళజోడు డబ్బాలో పెట్టు అంటూ మాట్లాడుతుంది. ఇక అందులో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ (Varalakshmi Tiffin Center) ఓనర్ అయినటువంటి ప్రభాకర్ (Prabhakar)పేరు కూడా వినిపించింది. అందులో తన కోసం ఓ నాలుగైదు ప్యాకెట్లు తీసుకోవాలని లావణ్య చెబుతోంది.ఇక ఈ వీడియో మాత్రమే కాకుండా ఒక ఆడియో కాల్ కూడా సంచలనం సృష్టిస్తుంది.
కోడ్ భాషలోనే మొత్తం దందా..
అందులో ఒక అబ్బాయి తో లావణ్య మాట్లాడుతూ..అటుగా ఓ వ్యక్తి బండి మీద వస్తాడు. డబ్బులు రెడీగా పెట్టుకోండి అని చెప్పింది. దానికి ఆ వ్యక్తి సరే అని చెబుతూనే నువ్వు చాలా మంచి దానివే అప్పుడప్పుడు పిచ్చి పట్టినట్టు చేస్తావు అని అన్నాడు. దానికి లావణ్య కూడా నేను మంచిదాన్నే కానీ నాకు హైదరాబాద్ (Hyderabad) వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ కావాలి అని చెబుతుంది. ఆ తర్వాత ఇచ్చేవాడికి అంత తొందర ఎందుకు అని డ్రగ్స్ గురించి మాట్లాడగా.. ఎక్కడపడితే అక్కడ పోలీసులు ఉంటున్నారురా.. జాగ్రత్తగా ఉండండి.. వాడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. డబ్బులు పట్టుకోండి.డబ్బులు కూడా లెక్క పెట్టుకోడు తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పింది.ఆ తర్వాత లావణ్య నాకు కూడా ఒక చపాతి కావాలి అంటూ తన కోడ్ లాంగ్వేజ్ లో డ్రగ్స్ ప్యాకెట్(Drugs Packet) అని చెప్పకుండా చపాతి అంటూ చెప్పింది.
ఇంతకంటే ఆధారాలు కావాలా..?
అలా కోడ్ లాంగ్వేజ్ లో లావణ్య వేరే వ్యక్తితో మాట్లాడిన సంచలన ఆడియో కాల్ నెట్టింట వైరల్ గా మారడంతో లావణ్య చీకటి దందా మొత్తం బయటపడింది. అయితే లావణ్య డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా చాలామందికి డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియకపోతే వాటిని కూడా సరఫరా చేస్తుంది అనేదానికి ఈ ఆడియో ప్రూఫ్ గా దొరికింది. ఏది ఏమైనప్పటికీ లావణ్య డ్రగ్స్ కేసు ఇష్యూ ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుందో..ఇంకా ఎన్ని వీడియోలు, ఆడియోలు బయటపడతాయో చూడాలి. అయితే రాజ్ తరుణ్ గతంలో లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని చెబితే సుద్ధ పూసలాగా నేను డ్రగ్స్ తీసుకోనని, కావాలనే నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారంటూ మాట్లాడింది. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలు,ఆడియోలను బట్టి చూస్తే రాజ్ తరుణ్ అమాయకుడని లావణ్యనే పెద్ద కిలాడి అంటూ చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
also read:Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. రన్ టైమ్ లాక్ చేసిన మేకర్స్..పైగా ఐపీఎల్ తో సమానం అంటూ!
లావణ్య కొత్త వీడియో లీక్..!#lavanyarajtarun #lavanya #RajTarun #drugs #BIGTVCinema pic.twitter.com/n3o1M5lk7C
— BIG TV Cinema (@BigtvCinema) July 11, 2025