BigTV English
Advertisement

M.M.Keeravani: ఆ పో*ర్న్ స్టార్ ట్వీట్‌కు ఎంఎం కీరవాణి రిప్లై.. ఏకి పారేస్తున్న నెటిజన్స్

M.M.Keeravani: ఆ పో*ర్న్ స్టార్ ట్వీట్‌కు ఎంఎం కీరవాణి రిప్లై.. ఏకి పారేస్తున్న నెటిజన్స్

M.M.Keeravani:ప్రముఖ ఆస్కార్ గ్రహీత ఎమ్.ఎమ్.కీరవాణి (MM keeravani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ను మొదలుకొని యంగ్ హీరోల సినిమాల వరకు మ్యూజిక్ అందిస్తూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇటీవల రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా విమర్శలకు దూరంగా ఉంటూ తన పని చేసుకుంటూ వెళ్తున్న కీరవాణి పై కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.


ఇదివరకే ఆరోపణలు ఎదుర్కొన్న కీరవాణి..

ముఖ్యంగా బుల్లితెర ఛానల్ లో గత 25 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమం ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ సీజన్లో ప్రముఖ సింగర్ ప్రవస్థి (Pravasthi).. కీరవాణిపై ఆరోపణలు చేసింది. దీనికి తోడు కీరవాణి అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ కామెంట్లు చేసింది. అయితే ఆ సమయంలో కీరవాణిపై చాలామంది విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు మరొకసారి కీరవాణి చేసిన పనికి చివాట్లు పెట్టడమే కాదు సిగ్గు లేదా అంటూ సంచలన కామెంట్లు చేస్తున్నారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పై ఇప్పుడు విమర్శలు రావడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


పో*ర్న్ స్టార్ ట్వీట్ కి కీరవాణి రిప్లై..

అసలు విషయంలోకి వెళ్తే.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్.కీరవాణి, పో*ర్న్ స్టార్ మియా మల్కోవా (Mia Malkova) కు సంబంధించిన పాత ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కీరవాణి పై భారీ ట్రోలింగ్ జరగడానికి కారణం అవుతున్నాయని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే మియా మాల్కోవా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెడుతూ..” ఇప్పుడే గాడ్ సెక్స్ ట్రూత్ ఫుల్ వీడియో చూశాను.. మ్యూజిక్ నాపై బాగా ఇంపాక్ట్ చూపించింది. దీన్ని మాటల్లో వర్ణించలేను” అని చెబుతూ కీరవాణికి థాంక్స్ చెప్పింది మియా మల్కోవా . అంతేకాదు నిజంగానే అమేజింగ్ హగ్గులు.. ముద్దులు పంపిస్తున్నాను అంటూ తెలిపింది. ఇక దీనిపై స్పందించిన ఎం ఎం కీరవాణి. థాంక్యూ మియా అంటూ రిప్లై ఇచ్చారు.

కీరవాణి పై నెటిజన్స్ ట్రోల్స్..

దీంతో నెటిజన్స్ ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. అంకుల్ ఆన్ ఫైర్.. ముసలోడే కానీ మహానుభావుడు.. నిన్ను చూశాక మూగబోయిన వీణలు మళ్ళీ మోగాయి అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందించడమే కాదు ఈ వయసులో సిగ్గు లేదా అంటూ కాస్త ఘాటుగానే కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఇక కీరవాణి ప్రస్తుతం పలువురు హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీకి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.

ALSO READ: Kingdom Release date: కింగ్ డం రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే ?

 

Related News

Sigma : సందీప్ కిషన్ తో విజయ కొడుకు చేయబోయే సినిమా కథ ఇదే

SS Rajamouli : గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కి నో కెమెరాస్, తమిళ్ ఇండస్ట్రీని ఫాలో అవుతున్నారా?

50 Years Of Mohan Babu : మోహన్ బాబుకు గ్రాండ్ ఈవెంట్, ఈసారి ఏ వైరల్ స్పీచ్ ఇస్తారో?

Ravi Babu : చివరిసారిగా అతని కాళ్ళను తాకాను, రామానాయుడు గొప్పతనం ఇదే

SSMB29: పాట వింటుంటే టైటిల్ అదే అనిపిస్తుంది, వారణాశి నా లేక సంచారి నా?

Mowgli: సందీప్ రాజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం, అసలు కారణం ఏంటి?

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

Big Stories

×