BigTV English
Advertisement

CM Revanth Reddy: జూలై 7 జీవితంలో మరచిపోలేని మైలురాయి.. సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్

CM Revanth Reddy: జూలై 7 జీవితంలో మరచిపోలేని మైలురాయి.. సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి.. ప్రజానేత.. ప్రజల కోసం అహర్నిశలు పోరాడే గొప్ప వ్యక్తి. ప్రత్యేక పరిచయం అక్కరలేని పేరు. జనాల నుంచి వచ్చిన ప్రజా నేత ఆయన. రైతులను అదుకునే ఆపద్భాందవుడు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ.. అభివృద్ది పథం వైపు నడిపిస్తున్న జన హృదయ నేత సీఎం రేవంత్ రెడ్డి. ఓ చిన్న కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, టీపీసీసీ ప్రెసిడింట్, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిధాయకం. టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో గత పాలకులు ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా.. భయపడకుండా ప్రజల కోసం పోరాడినా జన నేత ఆయన. రేవంత్ పోరాట పటిమను చూసి స్వయంగా సోనియాగాంధీ టీపీసీసీ పదవిని కట్టబెట్టారు. ఆయనను పీసీసీ చీఫ్ కాకుండా అడ్డుకొనేందుకు అనేక రకాల ప్రయత్నాలు జరిగినా.. పదవి మాత్రమే ఆయననే వరించింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి దక్కింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్లిందంటే రేవంత్ రెడ్డి చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక పోస్ట్ చేశారు.


‘నియంతృత్వాన్ని సవాల్ చేసి…
నిర్భందాన్ని ప్రశ్నించి…
స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన
మరిచిపోలేని సందర్భం.

నేటి ప్రజా పాలనకు
నాడు సంతకం చేసిన సంకల్పం.


శ్రీమతి సోనియాగాంధీ ఆశీస్సులు
శ్రీ రాహుల్ గాంధీ అండతో…
రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా
బాధ్యతలు స్వీకరించిన జూలై 7…
జీవితంలో మరచిపోలేని మైలురాయి’ అని సీఎం రేవంత్ రాసుకొచ్చారు.

రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కాంగ్రెస్ కీలక నేతలను మరిపించేలా రాజకీయం చేయటం ద్వారా పెద్ద సంఖ్యలో అనుచరలను పెంచుకున్నారు. ముందు ఏబీవీపీలో యాక్టివ్‌గా పని చేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ నుంచి జెడ్పీటీసీ సీటు ఆశించి కొంత నిరాశకు గురయ్యారు. స్వతంత్ర అభ్యర్ధిగానే పోటీ చేసి మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తరువాత 2008 లో ఎమ్మెల్సీగా గెలిచారు. తరువాతి కాలంలో టీడీపీలో చేరి.. 2009, 2014 లో కొడంగల్ నుంచి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.

ALSO READ: Ysrcp Self Goal: వైసీపీ సెల్ఫ్ గోల్.. ఆ వీడియో పెట్టి అడ్డంగా బుక్కైపోయారుగా!

ఆ తరువాత కొంత కాలం టీడీపీలో కొనసాగినా.. రాష్ట్రంలోని అప్పటి పరిస్థితుల కారణంగా.. పార్టీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 2019లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత మల్కాజ్ గిరి నుండి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో జనాకర్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డిపై విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయనకు టీపీసీసీ ఇవ్వటం ద్వారా పార్టీలో కీలక నేతల నుండి వ్యతిరేకత రాకుండా.. సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. రేవంత్ కోరుకున్న విధంగా పీసీసీ చీఫ్ పదవి దక్కటంతో టార్గెట్ కేసీఆర్, బీఆర్ఎస్ లక్ష్యంగా ముందుకు వెళ్లారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేతల నుండి సహకారం అందడంతో పార్టీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషిచేశారు. పార్టీ అధికారంలో రావడానికి కీలక నేతలను కలుపుకుంటూ రేవంత్ రెడ్డి చేసిన కృషి మరవలేనది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఎక్కువ కష్టపడింది ఆయనే చెప్పవచ్చు. ఇది కదా మరీ ప్రజా నేత సీఎం రేవంత్ రెడ్డి అంటే…

 

Related News

Pocharam Srinivas: చెప్పుతో కొట్టండి! పోచారం స్వరం మారుతుందా?

Hydra: ఇదిరా హైడ్రా అంటే.. ఫిర్యాదు చేసిన వెంటనే పార్క్ చుట్టు ఫెన్సింగ్

Karimnagar: అడ్లూరికి తలనొప్పిగా మంత్రి పదవి!

Minister Sitakka: బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా నో యూజ్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Telangana Government: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ కానీ ఉద్యోగులకు ఇక నో శాలరీ

Weather News: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్?

Palakurthi Politics: అత్తాకోడళ్లపై ఆగ్రహం.. పాలకుర్తిలో ఏం జరుగుతోంది?

Kavitha: కేసీఆర్ నీడ నుంచి నన్ను దూరం చేశారు.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×