Kingdom Release date:’లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) . ముఖ్యంగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో నటించి, తన నటనతో అందరిని అబ్బురపరిచారు. ఇక ఈ సినిమా తర్వాత ‘పెళ్లిచూపులు’ సినిమాలో హీరోగా అవకాశాన్ని అందుకొని మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. అటు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత ‘గీత గోవిందం’ సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ద్వారక, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, టాక్సీవాలా ఇలా చాలా చిత్రాలలో నటించారు. కానీ ఏ సినిమా కూడా పెద్దగా గుర్తింపును అందివ్వలేదు.
కింగ్ డం పై భారీ అంచనాలు..
ఇక చివరిగా లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అర్జున్ రెడ్డి రేంజ్ లో సక్సెస్ లభించలేదు. ఇకపోతే ఎలాగైనా సరే ఈసారి సక్సెస్ అందుకోవాలని గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కింగ్డమ్ (Kingdom ) అనే సినిమా చేస్తున్నారు. భారీ అంచనాలను రాబోతున్న ఈ సినిమాపై ఊహకందని ఎక్స్పెక్టేషన్స్ అభిమానులలో ఉన్నాయని చెప్పవచ్చు. స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా.. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వాయిదా పడుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కింగ్ డం రిలీజ్ డేట్ లాక్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 1వ తేదీన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ భావించారు. కానీ ఆగస్టు ఒకటి అష్టమి కావడంతో ఒకరోజు ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఈ సినిమా జూలై 31వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.
కింగ్డమ్ సినిమా విశేషాలు..
గౌతమ్ తిన్ననూరి రచన దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా స్కై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, 14 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవరనాగ వంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈయన సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.
ALSO READ:OG Theatrical Rights: పవన్ కళ్యాణ్ ఓజీ థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్.. పెరుగుతున్న పోటీ!