E-Paper
Advertisement

Psych Siddhartha: న్యూ ఇయర్ స్పెషల్.. సైక్ సిద్ధార్థ టికెట్ ధరలు ఇవే!

Psych Siddhartha: న్యూ ఇయర్ స్పెషల్.. సైక్ సిద్ధార్థ టికెట్ ధరలు ఇవే!
Advertisement

Psych Siddhartha: ఇటీవల కాలంలో ఏదైనా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు కాస్త పెంచుతున్నారు కానీ చిన్న సినిమాలకు అత్యంత తక్కువ ధరకే టికెట్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 99 రూపాయలకే టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకువచ్చి చిన్న సినిమాల నిర్మాతలు మంచి లాభాలను అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్స్ సందర్భంగా రాబోయే సినిమాల విషయంలో కూడా టికెట్ల రేట్ల విషయంలో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నందు (Sree Nandu), యామిని భాస్కర్(Yamini Bhaskar) ప్రధాన పాత్రులలో నటించిన సైక్ సిద్ధార్థ్  (Psych Siddhartha) ఈ సినిమా జనవరి ఒకటవ తేదీ విడుదల కానుంది.

పివిఆర్ ఐనాక్స్..

నిజానికి ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే రోజు బాలకృష్ణ అఖండ 2 సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతూ జనవరి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదలకు మరొక రోజు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా  టికెట్ ధర గురించి సురేష్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా జనవరి ఒకటో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాదులోని పివిఆర్ ఐనాక్స్(PVR Inox) ధరలను తగ్గిస్తూ అధికారకంగా తెలియచేశారు.

న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్..

Advertisement

ఈ నేపథ్యంలోనే సురేష్ ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని తన అధికారక ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. అత్యంత తక్కువ ధరికే బిగ్ స్క్రీన్ పై సరికొత్త సినిమాని ఎంజాయ్ చేయండి అంటూ చిత్ర బృందం హైదరాబాద్లోని పివిఆర్ ఐనాక్స్ లో సైక్ సిద్ధార్థ సినిమా టికెట్ ధరలను కేవలం రూ. 105 లకే అందుబాటులోకి తీసుకువచ్చారు. జనవరి ఒకటవ తేదీ సైక్ సిద్ధార్థ సినిమాని అసలు మిస్ అవ్వదు, ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోండి అంటూ  ఒక పోస్టర్ విడుదల చేశారు దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

సాధారణంగా పివిఆర్ లో సినిమా చూడాలంటే టికెట్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాంటిది కేవలం 105 రూపాయలకే ఈ సినిమా చూసే అవకాశాన్ని చిత్ర బృందం కల్పించారు. ఇక ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా కేవలం 99 రూపాయలకు మాత్రమే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. చాలా రోజుల తర్వాత శ్రీ నందు ఒక అద్భుతమైన విభిన్న కథ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇదివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో నందు సిద్ధార్థ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీ నందు రానా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి శ్రీ నందుకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Mega Victory Mass song: ఆర్ యూ రెడీ.. మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసిందిరోయ్!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×