E-Paper
Advertisement

Niharika: ‘చికిరి చికిరి’ పాటకు నిహారిక డ్యాన్స్.. క్లాప్స్ కొట్టిన జానీ మాస్టర్!

Niharika: ‘చికిరి చికిరి’ పాటకు నిహారిక డ్యాన్స్.. క్లాప్స్ కొట్టిన జానీ మాస్టర్!
Advertisement

Niharika: మెగా డాటర్ మాత్రమే కాదు, స్వతహాగా నిహారిక కొణిదెల (Niharika Konidela) నటి కూడా. ఆమె హీరోయిన్‌గా కొన్ని సినిమాలను కూడా చేశారు. ప్రస్తుతం నటనను పక్కన పెట్టి, నిర్మాతగా దూసుకెళుతున్నారు. ఇక బుల్లితెర హోస్ట్‌గా కూడా ఆమె ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు మరోసారి బుల్లితెరపై తన తడాఖా చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి జీ5, జీ తెలుగు ఛానల్స్‌లో మొదలైన ‘ఆట’ (Aata) డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ప్రోమోలలో నిహారిక ఇటీవల విడుదలై రికార్డులు క్రియేట్ చేసిన ‘పెద్ది’ (Peddi) మూవీలోని ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారని, ఏమైనా మెగా బ్లడ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Re Release Trend: రీ రిలీజ్‌లు పెద్దగా వర్కవుట్ కావడం లేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

మెగా డాటర్‌ టాలెంటే వేరు

Advertisement

సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ డ్యాన్స్ ‌షో‌కు సీనియర్ నటి రాధిక, జానీ మాస్టర్, నిహారిక న్యాయ నిర్ణేతలు. వీరు ఎంట్రీ ఇచ్చే సమయంలో ఏదో ఒక పాటకు డ్యాన్స్ చేస్తుంటారనే విషయం తెలియంది కాదు. ఈ క్రమంలో సుధీర్ డ్యాన్స్ చేస్తుంటే, నిహారిక కూడా ‘చికిరి’ పాటకు సేమ్ తన అన్న రామ్ చరణ్ స్టెప్స్‌ని దించేశారు. రాధిక, జానీ మాస్టర్ ఇద్దరూ షాకవడమే కాకుండా.. క్లాప్స్ కొట్టి అభినందించారు. జానీ మాస్టర్ అయితే చాలా బాగా చేశావ్ అంటూ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఏదిఏమైనా మెగా డాటర్‌లో ఉన్న టాలెంటే వేరని మరోసారి నిహారిక నిరూపించిందని మెగా ఫ్యాన్స్, ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి కొందరు ఈ వీడియో కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. నిహారిక నిర్మాతగా తన ఫింక్ ఎలిఫింట్ పిక్చర్స్ బ్యానర్‌లో రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘రాకాస’ అనే టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read- Vishwak Sen: పడటం తప్పు కాదు.. తిరిగి మళ్ళీ నిలబడకపోవడం తప్పు! జ్ఞానోదయం అయినట్టుంది

ఏప్రిల్ 30న ‘పెద్ది’

Advertisement

మరో వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన గ్లింప్స్, ‘చికిరి చికిరి’ సాంగ్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేయడంతో బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి రెండో పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Sampradayini Suppini Suddapoosani: థియేటర్లలోనే శివాజీ సాంప్రదాయని సుప్పిని  సుద్దపూసిని రిలీజ్…ఎప్పుడంటే?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×