E-Paper
Advertisement

Re Release Trend: రీ రిలీజ్‌లు పెద్దగా వర్కవుట్ కావడం లేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Re Release Trend: రీ రిలీజ్‌లు పెద్దగా వర్కవుట్ కావడం లేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!
Advertisement

Re Release Trend: ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు, అన్ని సినిమా ఇండస్ట్రీలలో రీ రిలీజ్‌ల ట్రెండ్ (Re Release Trend) నడుస్తోంది. వింటేజ్ సినిమాలను మళ్లీ వెండితెరపైకి తెచ్చి ప్రేక్షకులు, అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలు అంతగా వర్కవుట్ కావడం లేదని అంటున్నారు టాలీవుడ్‌కు చెందిన నిర్మాత. ఆ నిర్మాత ఎవరో కాదు.. టాలీవుడ్‌లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరే.. ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni). ప్రస్తుతం ఆయన సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మించిన విషయం తెలిసిందే. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ధీరజ్ మొగిలినేని చిత్ర విశేషాలతో పాటు, ఈ సినిమాకు పోటీగా వస్తున్న సినిమాల గురించి మాట్లాడారు.

Also Read- Vishwak Sen: పడటం తప్పు కాదు.. తిరిగి మళ్ళీ నిలబడకపోవడం తప్పు! జ్ఞానోదయం అయినట్టుంది

15 నిమిషాల సీన్స్ మాత్రమే

Advertisement

‘‘15 రోజుల క్రితమే ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. ప్రమోద్, వంశీ అన్నలకు కాల్ చేసి ఈ సినిమా నేను డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నానని చెప్పా. వారు ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. ఇది చెన్నై బ్యాక్ డ్రాప్‌లో సాగే మంచి లవ్ స్టోరీ. టైటిల్ చూసి ఇదోదే ఓన్లీ యూత్ చూడాల్సిన సినిమా అనుకుంటారేమో.. అది నిజం కాదు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. శివ, మిత్ర అనే రెండు క్యారెక్టర్స్ జర్నీ చాలా బాగా దర్శకుడు తెరకెక్కించారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి కేవలం 15 నిమిషాల సీన్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. మిగతా అంతా మిత్ర, శివ అనే జంట ఒకరికొకరు పరిచయం అయిన తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? ఒకరి కొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు అనేదే ఉంటుంది. హీరో నెల్లూరు నుంచి వచ్చి చెన్నైలో ఇంటీరియర్ డిజైనర్‌గా సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటే.. హీరోయిన్ చిత్తూరు నుంచి చెన్నై జాబ్ కోసం వస్తుంది. వీళ్లు కలిశాక ఏమైంది అనేది అసలు కథ.

Also Read- Sampradayini Suppini Suddapoosani: థియేటర్లలోనే శివాజీ సాంప్రదాయని సుప్పిని  సుద్దపూసిని రిలీజ్…ఎప్పుడంటే?

రీ రిలీజ్‌లు పెద్దగా వర్కవుట్ అవ్వట్లే..

Advertisement

డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే.. నా మనసుకు నచ్చిన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. ఎలాంటి హర్రీ బర్రీ లేకుండా నాకు నచ్చిందని అనిపిస్తే చాలు పంపిణీ చేస్తాను. ఇప్పుడు మా ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీకి సితార వారి ‘ఫంకీ’ మూవీకి మధ్య పోటీ ఉంది. థియేటర్స్ విషయంలోనూ మంచి కాంపిటేషన్ కనిపిస్తోంది. వాలెంటైన్స్ డేకు ‘మనసంతా నువ్వే, లవ్ స్టోరీ’ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. మాది కొత్త సినిమా కాబట్టి మా మూవీకి ఉండే ఆడియెన్స్ మాకుంటారని భావిస్తున్నాను. ఆ చిత్రాలకు ఉండే ఆడియెన్స్ వాటికి ఉంటారు. రీ రిలీజ్ అనేది ఆ సినిమా నిర్మాతల ఇష్టం. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐదారుగురు స్టార్ హీరోల విషయంలో తప్ప మిగతా హీరోలకు ఈ రీ రిలీజ్‌లు పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించడం లేదు. కాబట్టి, వాటి ప్రభావం మా సినిమాలపై పెద్దగా ఉండదనే అనుకుంటున్నాం’’ అని ధీరజ్ మొగిలినేని చెప్పుకొచ్చారు.

Also Read- Prabhas: ప్రభాస్‌కు ఎవరైనా ఎక్కువ నచ్చితే.. ఈ ఖరీదైన గిఫ్ట్ ఇవ్వకుండా పంపించరట!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×