E-Paper
Advertisement

Vishwak Sen: పడటం తప్పు కాదు.. తిరిగి మళ్ళీ నిలబడకపోవడం తప్పు! జ్ఞానోదయం అయినట్టుంది

Vishwak Sen: పడటం తప్పు కాదు.. తిరిగి మళ్ళీ నిలబడకపోవడం తప్పు! జ్ఞానోదయం అయినట్టుంది
Advertisement

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు ఈ మధ్యకాలంలో హిట్ అనేది లేదు. వరుసగా ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోతున్నాయి. వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్నా, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి తప్పితే.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఆయన నుంచి రాబోతున్న ‘ఫంకీ’ (Funky) సినిమా విషయంలో విశ్వక్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen), కె.వి. అనుదీప్ (KV Anudeep) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలో సౌత్ క్రష్ కయాదు లోహర్‌ హీరోయిన్. ఫిబ్రవరి 13న విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్‌లో నిర్వహించారు.

Also Read- Mahesh Babu: ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.. ఆ సినిమా మహేష్ బాబు ప్రశంసలు!

పడటం తప్పు కాదు

Advertisement

ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ప్రతి సినిమా విడుదలకు ముందు టెన్షన్ పడేవాడిని.. కానీ ‘ఫంకీ’ విడుదలవుతుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నానని అన్నారు. ‘‘మన టైమ్ బాగున్నప్పుడు, మన సినిమాలు సక్సెస్ సాధిస్తున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ, నా గత రెండు చిత్రాలు సరిగా ఆడక, నేను నిరాశలో ఉన్నప్పుడు కూడా, నాతో పాటు నిల్చొని, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అభిమానుల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. జీవితంలో అప్పుడప్పుడు పడిపోతుంటాం. అది సహజం. అలా పడకపోతే దెబ్బ విలువ తెలియదు. కానీ, పడటం తప్పు కాదు.. తిరిగి మళ్లీ నిలబడకపోవడం తప్పు అని నేను అనుకుంటాను. అందరి ప్రేమ వల్లే నేను ఇక్కడ నిలబడ్డాను.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ పరిస్థితి ఇంత దారుణంగా ఉందేంటి? జాకీలేసి లేపినా కష్టమేనా?

దేవుడే ఈ కథను పంపించాడనిపించింది

Advertisement

‘ఫంకీ’ విషయానికి వస్తే.. అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసిన చిత్రమిది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు పరిస్థితులు బాలేనప్పుడు ఇంత అద్భుతమైన సినిమా నా దగ్గరకు వచ్చింది. ఆ దేవుడే ఈ కథను పంపించాడనిపించింది. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు అనుదీప్‌కు, నిర్మాత నాగవంశీకి, చినబాబుకు కృతజ్ఞతలు. థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఈ సినిమా విపరీతంగా నవ్విస్తుంది. అంతా ఎంజాయ్ చేస్తారు. కయాదు లోహర్‌‌తో నా జోడి చక్కగా కుదిరింది. ఆమెకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. ఈ సినిమా ఎవరినీ నిరాశపరచదని చెప్పుకొచ్చారు.

Also Read- The Raja Saab: హీరోనే కాదు హీరోయిన్ కూడా డూప్.. బయటపడ్డ షాకింగ్ విషయం..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×