E-Paper
Advertisement

Niharika Konidela: మేనల్లుడి విషయంలో బలమైన కోరిక కోరిన నిహారిక..నెరవేరిందా?

Niharika Konidela: మేనల్లుడి విషయంలో బలమైన కోరిక కోరిన నిహారిక..నెరవేరిందా?
Advertisement

Niharika Konidela: నిహారిక కొణిదెల ప్రస్తుతం రాకాసా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక (Niharika)తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు తన వృత్తిపరమైన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈమెకు తన మేనల్లుడి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. నిహారిక తన తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తన అన్నయ్యకు కొడుకు పుట్టిన తర్వాత నిహారిక ప్రతిరోజు తన మేనల్లుడిని చూడడం కోసం తన ఇంటికి వెళ్తుందని తెలుస్తుంది.

అల్లుడు విషయంలో కోరిక నెరవేరింది..

ఇలా తన మేనల్లుడు గురించి ప్రశ్నలు ఎదురవడంతో నిహారిక తన అల్లుడు గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను వయసులో కొంచెం పెద్దయిన తర్వాత చిన్నప్పుడు అన్నయ్య ఫోటోలను చూసి అన్నయ్య ఇప్పుడు ఇలాగ ఉంటే బాగుండేది ఎంతో చక్కగా ఆడించేదాన్ని అని కోరుకునే దాన్ని. చిన్నప్పుడు అన్నయ్య చాలా ముద్దుగా, లడ్డులాగా ఉండేవాడు. ఇక అన్నయ్యకు కొడుకు పుడితే అలాగే ఉండాలని చాలా బలంగా కోరుకున్నాను. ఇలా అల్లుడు విషయంలో నా కోరిక నెరవేరిందని అచ్చం అన్నయ్య పోలికలతోనే వాయువ్ తేజ్(Vaayuv Tej) ఉన్నాడని నిహారిక తెలిపారు.

అచ్చం అన్నయ్యలానే వాయువ్ తేజ్..

Advertisement

ఇప్పుడు వాయువ్ తేజ్ ను ఎత్తుకొని తన అన్నయ్య చిన్నప్పటి ఫోటోని పక్కన పెట్టుకుంటే అచ్చం అలాగే ఉన్నాడని, చిన్నప్పుడు మా అన్నయ్యని ఎత్తుకోవాలని కోరిక ఇప్పుడు అల్లుడు విషయంలో నెరవేరింది అంటూ నిహారిక ఎంతో మురిసిపోయారు. ఇక తన అల్లుడిని చూడనిదే తనకు తోచదని ఈ సందర్భంగా నిహారిక తెలియజేశారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులకు మొదటి సంతానంగా అబ్బాయి వాయువ్ తేజ్ జన్మించిన సంగతి తెలిసిందే. ఇలా మెగా ఫ్యామిలీలో మొదటి వారసుడుగా జన్మించిన సంగతి తెలిసిందే. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెద్దల సమక్షంలో 2023 నవంబర్ 1వ తేదీ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు. గత ఏడాది ఈ జంట మొదటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

నిర్మాతగా సక్సెస్ అందుకున్న నిహారిక..

Advertisement

ఇక నిహారిక రాకాసా సినిమా విషయానికి వస్తే నిహారిక నిర్మాణంలో ఇది రెండవ సినిమా కావటం విశేషం. ఈమె ఇదివరకు ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మించి నిర్మాతగా గుర్తింపు పొందారు. ఇక నిహారిక తన మొదటి సినిమాగా కమిటీ కుర్రాళ్ళు సినిమాకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ సినిమాగా రాకాసా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి.

Also Read: V.V.Vinayak: మెగా హీరో పై వి.వి వినాయక్ కామెంట్స్.. హిట్ డైరెక్టర్ల వెంట పరిగెత్తే రకం కాదు!

Related News

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

Big Stories

Advertisement
×