E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: ఓబీసీ మహిళలకు.. సబ్ కోటా ఇవ్వాల్సిందే.. కల్వకుంట్ల కవిత డిమాండ్

Kalvakuntla Kavitha: ఓబీసీ మహిళలకు.. సబ్ కోటా ఇవ్వాల్సిందే.. కల్వకుంట్ల కవిత డిమాండ్
Advertisement

Kalvakuntla Kavitha: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల నెరవేరే సమయం ఆసమన్నమవుతున్న తరుణంలో సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోసం సబ్ కోటా ఉండటం అంతే ముఖ్యం అని అన్నారు. ఈ మేరకు మీడియా ప్రకటనను కవిత విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ప్రస్తుత లోక్ సభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తోందని కవిత అన్నారు. ‘మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ఉప కోటా కల్పించకపోవడం అంటే మెజారిటీ ప్రజలను మోసం చేయటమే’ అని పేర్కొన్నారు. చట్టసభల్లో సామాజిక సమానత్వం రావాలంటే ఓబీసీ మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నారు.

Advertisement

రిజర్వేషన్లలో రిజర్వేషన్ ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని కేంద్రానికి సూచించారు. ఓబీసీ మహిళలకు ఉప కోటా లేకుండా ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తే మరోసారి పోరాటం తప్పదని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఏ విధంగా పలు రాజకీయ పార్టీలను, మహిళ సంఘాలను ఏకం చేసి ఢిల్లీలో దీక్ష చేస్తామో… అదే విధంగా మరోసారి పోరాటం చేస్తామన్నారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్లు ఇచ్చినా.. ఆయా వర్గాల ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కదని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: KTR: రూ.38కోట్ల విద్యుత్ భారం.. భట్టీని కలిసిన కేటీఆర్.. ఆపై కీలక విజ్ఞప్తి

Advertisement

మరోవైపు దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయటమే సామాజిక న్యాయమని కవిత అన్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఓబీసీ వర్గాల మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే వారికి ఎలా న్యాయం దక్కుతుందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాజ్యాంగబద్ద వాటా ఉందని కానీ ఓబీసీల పరిస్థితి ఏంటనీ నిలదీశారు. అన్ని పార్టీల నాయకులు, ఆయా పార్టీల్లో ఉన్న ఓబీసీ మహిళ నేతలు, మహిళా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఓబీసీ మహిళలకు ఉప కోటా కేటాయించే వరకు జాగృతి తరఫున మరోసారి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Also Read: Credit Card Rules: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? వీటిని అస్సలు కొనొద్దు.. చేశారో చిక్కుల్లో పడ్డట్లే!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×