Niharika Comment:ఇండస్ట్రీలో కొన్ని సార్లు అనుకోకుండా చేసిన కామెంట్స్ ఎంతలా వైరల్ అవుతాయో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. తాజాగా ఒక ప్రశ్నను స్కిప్ చేసే క్రమంలో మరో కామెంట్ చేసి ఇలాగే నెటిజన్లకి స్టఫ్ అయిపోయింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. విషయంలోకి వెళితే నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ ఫిల్మ్ రాకాస.సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇక ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్.
కలెక్షన్స్ పోస్టర్ మాత్రం రివీల్ చెయ్యట్లేదు
ఇక ఈవెంట్ మొదలైనప్పటి నుంచి రిపోర్టర్స్ తమదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ నిహారికాను ఉక్కిరిబిక్కిరి చేశారు. “సాలిడ్ రెస్పాన్స్ అంటున్నారు, సినిమా సక్సెస్ మీట్ పెట్టేస్తున్నారు, కానీ కలెక్షన్స్ పోస్టర్ మాత్రం రివీల్ చేయట్లేదు” అంటూ ప్రశ్నించగా డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడికి వచ్చారు అంటేనే సినిమా లాభాల్లో ఉందని అర్థం. రాయలసీమ, ఆంధ్రా నుంచి వాళ్లు హ్యాపీగా ఇక్కడికి వచ్చారంటేనే నంబర్స్ బాగున్నాయని తెలుస్తోంది. అయినా ఎంతకు కొన్నారు, ఎంత లాభం వచ్చింది అనే లెక్కలన్నీ మా చార్టర్డ్ అకౌంటెంట్స్ చూసుకుంటారు అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ మెగా డాటర్.
‘రాకాస’కి.. ‘రాకా’కి ఏమైనా లింక్ ఉందా
ఇక బన్నీ – అట్లీ కాంబోలో వస్తున్న రాకా టైటిల్‌పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. “మీ ‘రాకాస’కి.. వాళ్ల ‘రాకా’కి ఏమైనా లింక్ ఉందా?” అంటే “అది కంప్లీట్ కోఇన్సిడెన్స్. అంటే తప్ప నాక్కూడా ఆ విషయం తెలీదు. పెద్ద సినిమా కథ. ఇవన్నీ టాప్ సీక్రెట్‌గా ఉంచుతారు. ఏదేమైనా నాక్కూడా సర్ప్రైజ్ గానే ఉంది” అంటూ ఆన్సర్ ఇచ్చింది. అంతా బాగానే ఉంది, ఇక ఈవెంట్ అయిపోతుంది అన్న టైమ్‌లో నిహారిక చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
అంబేద్కర్ జయంతి ఎప్పుడో కూడా తెలీకుండా
మీడియా నిహారికను ఇంకో ప్రశ్న వేయడానికి ట్రై చేస్తుంటే దాన్ని స్కిప్ చేసే క్రమంలో “అయిపోయింది.. హ్యాపీ అంబేద్కర్ జయంతి” అంటూ చెప్పి వెళ్లిపోయింది. అయితే ఏదో చెప్పబోయి ఇలా “హ్యాపీ అంబేద్కర్ జయంతి” అని చెప్పడం ఏంటని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న వస్తుంది. అంటే మరో నాలుగు రోజుల టైమ్ ఉంది. అలాంటిది అసలు అంబేద్కర్ జయంతి ఎప్పుడో కూడా తెలీకుండా ఇలా చెప్పడం ఏంటని, ఏప్రిల్ 10కి 14కి నాలుగు రోజుల గ్యాప్ ఉంది. కనీసం ఆ మాత్రం కూడా తెలీదా అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక మరికొంతమంది డేట్ మర్చిపోయారా… లేక మైండ్ బ్లాక్ అయ్యిందా? ప్రశ్నను స్కిప్ చేసేందుకు ఇంతకంటే మంచి సాకు దొరకలేదా అని కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మర్చిపోవడం ఒక తప్పు అయితే, ఇలా సందర్భం లేకుండా మధ్యలోకి లాగడం మరో తప్పు అన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈ మెగా డాటర్ టంగ్ స్లిప్ ఇష్యూని ఎక్కడిదాకా తీసుకెళ్తుందో!
also read:టాలీవుడ్ మల్టీప్లెక్స్‌లో ‘తమిళ’ దండయాత్ర! మన ‘డెకాయిట్’ కంటే ప్రదీప్ రంగనాథన్ సినిమాకే ఎక్కువ రేటా?