E-Paper
Advertisement

Roja Selvamani: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Roja Selvamani: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
Advertisement

Roja Selvamani: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్.కె. రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉగాది పండుగ రోజున సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాది రోజునా వైఎస్ జగన్, వైఎస్ భారతీ.. కుటుంబ సమేతంగా పండుగ జరుపుకున్నారన్న రోజా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన భార్యతో కలిసి ఎందుకు ఉగాది జరుపుకోలేదని రోజా నిలదీశారు. అటు సీఎం చంద్రబాబు సైతం భార్యతో కలిసి ఎందుకు పండుగ జరుపుకోలేదని ప్రశ్నించారు. ‘పండుగ రోజున లేకుండా చంద్రబాబు భార్య హెరిటేజ్ లో కూర్చుని పాలు పిసుకుతున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై కూడా రోజా ఘాటు విమర్శలు చేశారు. తిరుమలకు ఒక మహిళతో, షిరిడీకి మరో మహిళతో ఆయన వెళ్తారని ఆరోపించారు. పవిత్రమైన తిరుమలలో ఉగాది పండుగను ఎందుకు ఘనంగా నిర్వహించలేదని ఆమె నిలదీశారు. ఉగాది రోజున తిరుమలలో ఉండకుండా ఎక్కడకు వెళ్లారని బీఆర్ నాయుడుని రోజా ప్రశ్నించారు.

కుటుంబ సమేతంగా వచ్చి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి ఈ ముగ్గురికి (చంద్రబాబు, పవన్, బీఆర్ నాయుడు) వచ్చిన సమస్య ఏంటని రోజా నిలదీశారు. మరోవైపు జగన్, భారతి సంతోషంగా పండుగను జరుపుకున్నారని గుర్తుచేశారు. కూటమీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి ఏ ఒక్క హామీ అమలు చేయలేదని

Advertisement

Also Read: Thomson Streaming Box: గూగుల్ టీవీ స్ట్రీమర్‌కు పోటీగా.. థామ్సన్ 4K బాక్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని రోజా విమర్శించారు. ఆశ వర్కర్స్, రైతులు, మహిళలు ఇలా ఏ ఒక్కరు చంద్రబాబు పాలనలో సంతోషంగా లేరని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. గత జగనన్న పాలనలో రాష్ట్రంలోని ప్రతి పేదవాడు, ఉద్యోగి, రైతు సంతోషంగా ఉన్నారని రోజా చెప్పుకొచ్చారు.

Also Read: North Korea: కూతురితో కలిసి.. యుద్ద ట్యాంక్‌పై షికారు.. కిమ్ మామ స్టైలే వేరు!

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×