E-Paper
Advertisement

Rakasa: డ్యాన్స్ రాని వారి కోసం ‘స్నేక్ డ్యాన్స్’.. ప్రమోషన్స్ కోసం పెద్ద ప్లానే వేశారుగా!

Rakasa: డ్యాన్స్ రాని వారి కోసం ‘స్నేక్ డ్యాన్స్’.. ప్రమోషన్స్ కోసం పెద్ద ప్లానే వేశారుగా!
Advertisement

Rakasa: నిహారిక కొణిదెల నిర్మాతగా, జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిర్మిస్తున్న ‘రాకాస’ (Rakasa) చిత్ర ప్రమోషన్స్‌లో దూసుకెళుతోంది. ప్రమోషన్స్‌ను చాలా వినూత్నంగా మేకర్స్ ప్లాన్ చేశారు. చిన్న చిన్న వీడియోలతో ఇప్పటి వరకు ప్రమోట్ చేస్తున్న వస్తున్న టీమ్, ఇప్పుడో వీడియో సాంగ్‌తో ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు. మానస శర్మ (Manasa Sharma) దర్శకత్వంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరుగుతున్న మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఇప్పటి వరకు ‘రపప్పా’, ‘పదే పదే’ పాటల్ని మేకర్లు రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’ అనే వీడియో సాంగ్‌‌ (Snake Dance Video Song)ను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే ఇదొక ప్రమోషనల్ సాంగ్‌లా కనిపిస్తోంది.

Also Read- Vishwambhara: మెగాస్టార్ సినిమా జూలైలో రానుందా..రిలీజ్ డేట్ పై మళ్లీ సస్పెన్స్..!

రాదంటూనే.. డ్యాన్స్‌ని ఇరగదీశారు

Advertisement

ఎందుకంటే, ఇందులో సినిమాలోని గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ ‘స్నేక్ డ్యాన్స్’ పాటలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్, నయన్ సారిక తమ స్టైల్లో దుమ్ములేపేశారు. ఇక చివర్లో మెగా ప్రొడ్యూసర్ నిహారిక (Niharika Konidela) వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఎర్ర చీర కట్టి నిహారిక వేసిన మాస్ స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. డ్యాన్స్ రాని వారి కోసం ఈ పాట అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి, ప్రతి ఒక్కరూ కుమ్మేసేలా డ్యాన్స్‌ని ఇరగదీసినట్లుగా ఈ వీడియో ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ వేరు, ఈ పాట ఒక్కటి వేరు అన్నట్లుగా అందరూ ఈ పాటలో యమా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి వచ్చిన స్టెప్ వాళ్లు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా నిహారికను ఇలా అయితే ఇంత వరకు చూడలేదనే చెప్పాలి.

Also Read- Ram Charan: బాబాయ్ సినిమా వదిలేసి, బాలీవుడ్ సినిమాపై ప్రశంసలు.. ఇదేం బాలేదు చరణ్!

క్రేజ్ మరింతగా పెంచేసిన స్నేక్ డ్యాన్స్

Advertisement

అలా ఎందుకు నిహారిక గురించి చెబుతున్నామనేది తెలియాలంటే మాత్రం కచ్చితంగా ఈ వీడియో సాంగ్‌ని చూడాల్సిందే. ఈ పాటకు అనుదీప్ క్యాచీ ట్యూన్స్ అందించగా, రఘురాం సాహిత్యం ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. బెన్నీ దయాల్, మనీషా పాండ్రంకి, రితేష్ జి రావు, లక్ష్మీ మేఘన, వినాయక్ ఈ పాటను ఆలపించారు. ఈ పాట విడుదల తర్వాత ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రేక్షకులకు కావాల్సిన వినోదం ఇందులో 100 శాతం ఉందనే కాన్ఫిడెంట్‌ని ఈ పాట, ఈ పాటలోని అవతారాలు ఇస్తున్నాయి. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫర్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 3 భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Rashmika Mandanna: ఈ అనుభూతిని వర్ణించలేను.. ఇది ఆరంభం మాత్రమే!

Related News

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

Big Stories

Advertisement
×