E-Paper
Advertisement

Rashmika Mandanna: ఈ అనుభూతిని వర్ణించలేను.. ఇది ఆరంభం మాత్రమే!

Rashmika Mandanna: ఈ అనుభూతిని వర్ణించలేను.. ఇది ఆరంభం మాత్రమే!
Advertisement

Rashmika Mandanna: మనం నమ్మకంగా చేసిన పనికి గుర్తింపు దక్కితే వచ్చే ఆనందమే వేరు. అలాంటి ఆనందాన్నే పొందుతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). అందులోనూ ఆమె ది బెస్ట్ ఫేజ్‌లో ఉన్నప్పుడు మంచి గుర్తింపు, గౌరవం రావడంతో.. నిజంగా ఆమె ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి. అదే విషయాన్ని తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రానికిగానూ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards)లో ఆమె బెస్ట్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో అవార్డును అందుకున్న రష్మిక స్టేజ్‌పైనే తన సంతోషాన్ని తెలియజేశారు. తాజాగా ఆమె మరోసారి ఈ అవార్డ్స్‌పై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. చాలా గర్వంగా, సంతోషంగా ఉందని తెలిపారు.

Also Read- Anirudh XV Tour: రాక్‌స్టార్ అనిరుధ్ కాన్సర్ట్‌కు వెళుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

ఆ అనుభూతిని మాటల్లో వివరించలేను

Advertisement

‘‘నేను చిన్నప్పుడు ఎవరైనా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిస్తే, వారిని సూపర్ స్టార్‌లుగా చూసేదాన్ని. వారు అది ఎలా సాధించారు? రోజంతా వారు ఏం చేస్తారు? ఇలాంటి విషయాల గురించి ఆలోచించేదాన్ని. నిన్న సాయంత్రం రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం నాకు చాలా ప్రత్యేకం. నాలోని ఆ అనుభూతిని మాటల్లో వివరించలేను కానీ, నేను చాలా దూరం ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నానని అనిపిస్తోంది! నాలో ఒక రకమైన గర్వం, సంతోషం, సంతృప్తి కలిగాయి. ఈ ఏడాది ఇంత అద్భుతంగా ప్రారంభమవ్వడం, అందునా తెలంగాణలో రాష్ట్ర స్థాయి అవార్డుతో స్వాగతం లభించడం ఇంకా ప్రత్యేకంగా భావిస్తున్నాను. ఇందుకు గానూ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్‌కు కూడా థ్యాంక్యూ. దీనికి నేను ఎంతగానో కృతజ్ఞురాలిని! రాహుల్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు థాంక్యూ! నేను ఎప్పుడూ చెబుతుంటాను.. ఇది కేవలం ఆరంభం మాత్రమే! దీక్షిత్, అను ఇమ్మానుయేల్.. ఐ లవ్ యు గైస్!’’ అని రష్మిక తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆమె అందుకున్న అవార్డులతో పాటు దర్శకుడు రాహుల్‌తో ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేశారు.

Also Read- Kamal Haasan: పాలిటిక్స్‌లో పెద్దోడు.. సినిమాల్లో చిన్నోడు.. చిరుపై కమల్ జోక్స్!

చాలా చాలా స్పెషల్

Advertisement

ఇక అవార్డ్స్ ఫంక్షన్‌లో రష్మిక మాట్లాడుతూ.. ‘‘ఈ వేదిక సాక్షిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు నా నటనపై ట్రోల్స్ వచ్చేవి. ఇప్పుడు నటిగా మెప్పించి, స్టేట్ నుంచి ఈ అవార్డును అందుకున్నాను. ఇది ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతుంది. అందులోనూ ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి చిత్రానికి అవార్డు రావడం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే, ఇంకా ఇలాంటి ఎన్నో చిత్రాలు చేయడానికి నాకు కాన్ఫిడెంట్‌ని ఈ అవార్డు ఇచ్చింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్‌కి థ్యాంక్యూ చెబుతున్నాను, రష్మిక, భూమా (సినిమాలో రష్మిక పేరు) ఇద్దరూ.. నన్ను ఎంతగానో ప్రొటక్ట్ చేసిన రాహుల్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు. ఇంకా ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పారు.

Also Read- Actor Sai Kiran: కొడుకు పేరును రివీల్ చేసిన నటుడు సాయి కిరణ్… బాలీవుడ్ హీరో పేరు పెట్టారుగా?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×