E-Paper
Advertisement

Historical Movie OTT : సముద్రంలో కుప్పలు తెప్పలుగా తేలియాడే శవాలు… ఒళ్ళు గగుర్పొడిచే వార్ డ్రామా

Historical Movie OTT : సముద్రంలో కుప్పలు తెప్పలుగా తేలియాడే శవాలు… ఒళ్ళు గగుర్పొడిచే వార్ డ్రామా
Advertisement

Historical Movie OTT : మాగ్జిమస్ పాత్రలో రస్సెల్ క్రో నటించిన ‘గ్లాడియేటర్’ ఒక సంచలనం. 2000లో వచ్చిన ఈ వార్ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాకుండా ఎన్నో అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఇక 2024లో వచ్చిన పార్ట్ 2 కూడా ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చింది. భారీ యుద్ధ సన్నివేశాలు, రోమన్ కొలీజియం సెట్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక దర్శకుడు రిడ్లీ స్కాట్ 86 ఏళ్లు దాటినా, ఈ సినిమాను చాలా వేగంగా షూట్ చేశారు. ఆయన మేకింగ్ స్టైల్ చూసి హాలీవుడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. సినిమాలో గ్లాడియేటర్లు కేవలం మనుషులతోనే కాదు, ఖడ్గమృగాలు, షార్క్ చేపలతో కూడా పోరాడాల్సి వస్తుంది. ఇవి థియేటర్లో చూసేటప్పుడు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో వచ్చిన ‘గ్లాడియేటర్ 2’ (Gladiator II). 2000 నాటి క్లాసిక్ సినిమాకు కొనసాగింపుగా రూపొందింది. ఇందులో పాల్ మెస్కల్ (లూసియస్) కథానాయకుడిగా నటించగా, డెంజెల్ వాషింగ్టన్ (మెక్రినుస్ పాత్రలో), పెడ్రో పాస్కల్ (మార్కస్ అకాసియస్ పాత్రలో) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 2024లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 2,600 కోట్ల భారీ ఖర్చుతో తీశారు ఈ సినిమాను, హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఇది ఒకటి నిలిచింది. కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబట్టింది ఈ సినిమా. దాదాపు 3900కోట్లతో ఇది రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఆస్కార్ బరిలో నిరాశ

Advertisement

2025 ఆస్కార్ అవార్డుల్లో ఈ సినిమా కేవలం ఒక్క విభాగంలో మాత్రమే నామినేషన్ దక్కించుకుంది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఈ నామినేషన్ వచ్చింది. పార్ట్ 1 మూవీ 12 నామినేషన్లతో 5 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంటే, ఈ మూవీ మాత్రం ఒక్క అవార్డు కూడా గెలవలేకపోయింది. ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన డెంజెల్ వాషింగ్టన్‌కు ఉత్తమ సహాయ నటుడిగా నామినేషన్ వస్తుందని అందరూ భావించారు, కానీ ఆయనకు కూడా నామినేషన్ దక్కకపోవడం గమనార్హం. చివరిగా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో కూడా ఈ సినిమాకు అవార్డు దక్కలేదు. ఆ అవార్డును ‘వికెడ్’ (Wicked) సినిమా గెలుచుకుంది. మొత్తానికి మొదటి గ్లాడియేటర్ సినిమా 5 ఆస్కార్ అవార్డులను కొల్లగొడితే, దాని సీక్వెల్ అయిన గ్లాడియేటర్ 2 మాత్రం ఒక్కటి కూడా గెలవలేకపోయింది.

స్టోరీ ఏమిటంటే

మొదటి సినిమాలో చనిపోయిన హీరో మాగ్జిమస్ కొడుకు లూసియస్ ఇప్పుడు ఈ కథలో కథానాయకుడు. వీడు చిన్నప్పుడే రోమ్ ను వదిలి వేరే ఊరిలో పెరిగి పెద్దవాడవుతాడు. అక్కడ భార్యతో హాయిగా బతుకుతుంటే, రోమన్ సైన్యం వచ్చి ఆ ఊరి మీద పడి అందరినీ ఊచకోత కోస్తారు. లూసియస్ పెళ్ళాన్ని కూడా చంపేస్తారు. కోపంతో రగిలిపోతున్న లూసియస్‌ని బంధించి, బానిసగా మార్చి మళ్ళీ అదే రోమ్ నగరానికి తీసుకొస్తారు. అక్కడ మెక్రినుస్ అనే ఒక తెలివైన బిజినెస్ మెన్ లూసియస్ లోని కసిని చూసి, గ్లాడియేటర్ గా బరిలోకి దింపుతాడు. ఒక పెద్ద స్టేడియంలో క్రూరమైన మృగాలతో, వందల మంది సైనికులతో లూసియస్ చావుతో పోరాడాల్సి వస్తుంది.

Advertisement

గెలిచిన ప్రతిసారీ జనం చప్పట్లు కొడుతుంటే, వీడు మాత్రం తన కళ్ళ ముందే పెళ్ళాన్ని చంపిన రోమన్ జనరల్ మీద రివెంజ్ తీర్చుకోవాలని పళ్ళు కొరుకుతుంటాడు. చివరికి తన తల్లి లూసిల్లాను కలుసుకున్న తర్వాత, తను ఎవరో లూసియస్‌కి అర్థమవుతుంది. అన్యాయంగా పాలిస్తున్న ఆ ఇద్దరు పిచ్చి రాజులను గద్దె దించి, రోమ్ దేశాన్ని మళ్ళీ ప్రజల సొంతం చేయాలని డిసైడ్ అవుతాడు. చివరిగా రక్తం ఏరులై పారే యుద్ధంలో లూసియస్ తన పగ తీర్చుకున్నాడా ? తన తండ్రి ఆశయాలను నిలబెట్టాడా ? అనే ఈ క్లైమాక్స్ ను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also :  సమాధుల మీద కొత్త హోటల్ … దెయ్యాల దెబ్బతో రచ్చ రచ్చ… నవ్వులు పూయిస్తున్న హారర్ స్టోరీ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×