E-Paper
Advertisement

ఈ నెల కాదు ఈ ఏడాది మొత్తం మెగా ఫ్యామిలీదే.. నిహారిక సంచలన కామెంట్లు!

ఈ నెల కాదు ఈ ఏడాది మొత్తం మెగా ఫ్యామిలీదే.. నిహారిక సంచలన కామెంట్లు!
Advertisement

Niharika:మెగా డాటర్ నిహారిక (Niharika) హీరోయిన్ గా వర్కౌట్ కాకపోవడంతో నిర్మాతగా యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ.. ఇప్పుడు బడా ప్రొడ్యూసర్స్ జాబితాలో చోటు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే నిహారిక గతంలో కమిటీ కుర్రోళ్ళు సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాకాస అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ఇది. ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిహారిక ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ ఏడాది మొత్తం మెగా ఫ్యామిలీదే – నిహారిక

ప్రెస్ మీట్ లో భాగంగా ఈనెల మొదట్లో మీరు రాకాసతో వస్తున్నారు. చివర్లో మీ అన్నయ్య పెద్ది రిలీజ్ అవుతుంది. మొత్తానికి ఈ నెలను మెగా ఫ్యామిలీ ఖాతాలో వేయవచ్చా అని ప్రశ్నించగా.. నిహారిక స్పందిస్తూ..” ఈనెల కాదు ఈ ఏడాది మొత్తం మెగా ఫ్యామిలీ ఖాతాలో వేసుకోవచ్చు. ఒక మా ఫ్యామిలీ నుంచే ఏకంగా 6 సినిమాలు వస్తున్నాయి.” అంటూ సమాధానమిచ్చింది నిహారిక. మొత్తానికి అయితే ఈ ఏడాది మొత్తం ఆరు సినిమాలు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాయని చెప్పి మెగా అభిమానులలో ఫుల్ జోష్ నింపింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తున్న రాకాస..

Advertisement

ఇకపోతే రాకాస సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అందరికీ షాక్ ఇస్తోందనే వార్త ఇప్పుడు వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు సుమారుగా రూ.12.5 కోట్లు పలుకగా.. ఓవర్సీస్ హక్కులు రూ.2.25 కోట్లు, మిగిలిన భారతదేశ హక్కులు కలిపి రూ. 1.25 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అంతేకాదు మొత్తం థియేట్రికల్ బిజినెస్ 16 కోట్ల మార్కు అందుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ:

భారీ ధరకు ఓటీటీ డీల్..

Advertisement

ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 10 కోట్లకు డీల్ ఓకే అయినట్లు, ఆడియో హక్కులు ఒక కోటికి అమ్ముడుపోయినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు పెండింగ్లో ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే థియేటర్ రన్ ద్వారా కనీసం 17 కోట్ల షేర్, 32 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రమోషన్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్న చిత్ర బృందం ఓపెనింగ్స్ బాగుంటాయి అనే రేంజ్ లో తమ ప్రమోషన్స్ తో అదరగొట్టేస్తున్నారు. మొత్తానికైతే చిన్న సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం అంటే ఆ క్రెడిట్ మొత్తం మెగా డాటర్ నిహారికకి దక్కుతుందనే ప్రశంసలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×