E-Paper
Advertisement

ఆ జిల్లాలో భారీగా అంగన్‌వాడీ పోస్టులు.. టెన్త్ పాసైతే చాలు.. ఉద్యోగం వచ్చేస్తది!

ఆ జిల్లాలో భారీగా అంగన్‌వాడీ పోస్టులు.. టెన్త్ పాసైతే చాలు.. ఉద్యోగం వచ్చేస్తది!
Advertisement

నిరుద్యోగులకు ఇది శుభవార్త.. వైఎస్ఆర్ కడప జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మహిళా శిశు సంక్షేమ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు (AWW), సహాయకురాళ్ల (AWH) నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 171

Advertisement

మొత్తం 171 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో 30 అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు ఉన్నాయి. మిగిలిన 141 పోస్టులు అంగన్‌వాడీ సహాయకురాళ్ల కేటగిరీకి చెందినవి.

విద్యార్హత: పదో తరగతి పాస్ అయిన మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా వివాహిత మహిళలై ఉండాలి. అలాగే వారు ఏ గ్రామం లేదా వార్డులోని ఖాళీకి దరఖాస్తు చేస్తున్నారో అదే ప్రాంతానికి చెందిన స్థానికులై ఉండటం తప్పనిసరి.

Advertisement

వయస్సు: అభ్యర్థుల వయస్సు 2026 జులై 1 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందుబాటులో లేని ప్రాంతాల్లో కనిష్ట వయస్సును 18 ఏళ్లుగా పరిగణనలోకి తీసుకుంటారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా 100 మార్కులకు నిర్వహించనున్నారు. ఎంపిక విధానంలో అభ్యర్థుల పదో తరగతి మార్కులకు అత్యధికంగా 50 మార్కుల వెయిటేజీ కల్పించారు. ప్రీ-స్కూల్ శిక్షణ పొందిన వారికి 5 మార్కులు కేటాయించారు.

సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వితంతువులకు 5 నుంచి 10 మార్కులు, అనాథలకు 10 మార్కులు, వికలాంగులకు 5 మార్కుల చొప్పున అదనంగా ఇస్తారు. మిగిలిన 20 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ మొత్తం క్రెడిట్ల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు గెజిటెడ్ అధికారి ధృవీకరించిన విద్యార్హత పత్రాలను జత చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించాలి.

చివరి తేది: దరఖాస్తులు సమర్పించడానికి ఏప్రిల్ 13, 2026 సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తారు.

ఇంటర్వ్యూ తేది: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 23న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్న అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://kadapa.ap.gov.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×