E-Paper
Advertisement

Vivo V70 FE అరాచకం.. చీకట్లో మెరుస్తుంది, నీటిలోనూ ఫొటోలు తీస్తుంది, కెమెరా పిచ్చ క్లారిటీ బ్రో!

Vivo V70 FE అరాచకం.. చీకట్లో మెరుస్తుంది, నీటిలోనూ ఫొటోలు తీస్తుంది, కెమెరా పిచ్చ క్లారిటీ బ్రో!
Advertisement

Vivo V70 FE Launched: వివో అంటేనే కెమెరా, స్టైలిష్ లుక్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు దానికి తోడు భారీ బ్యాటరీని కూడా జత చేస్తూ కంపెనీ తమ కొత్త మోడల్ ‘Vivo V70 FE’ని భారత్‌లో లాంచ్ చేసింది. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లోనే ఫ్లాగ్‌షిప్ లెవల్ ఫీచర్లను కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్ బ్యాటరీ అయిపోతుందనే భయం ఉన్నవారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. ఇప్పుడీ Vivo V70 FE పూర్తి వివరాల్లోకి వెళితే..

ధర వివరాలు ఇలా..

ఈ Vivo V70 FE బేస్ మోడల్ 8GB + 128GB రూ. 37,999గా నిర్ణయించారు. కొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారి కోసం 8GB + 256GB వేరియంట్ రూ.40,999కి, ఇక టాప్‌ఎండ్ మోడల్ 12GB + 256GB రూ.44,999కి అందుబాటులో ఉంది. మాన్సూన్ బ్లూ, నార్తర్న్ లైట్స్ పర్పుల్ అనే రెండు అదిరిపోయే కలర్లలో ఈ ఫోన్ మెరిసిపోతోంది. ఇప్పటికే ప్రీ ఆర్డర్లు మొదలైపోయాయి. ఏప్రిల్ 9 నుంచి ఈ ఫోను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా వివో స్టోర్లలో విక్రయానికి రానుంది.

Advertisement

Also Read: 7000mAh బ్యాటరీతో ‘Realme 16 5G’ వచ్చేసింది.. ఆ సెల్ఫీ మిర్రర్ ఐడియా భలే ఉంది బాసూ!

ఆండ్రాయిడ్ 16 వెర్షన్..

6.83 అంగుళాల పెద్ద OLED డిస్‌ప్లేతో ఈ ఫోన్ చూడటానికి చాలా గ్రాండ్‌గా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ మూమెంట్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఇక గేమ్స్ ఆడేవారికి, మల్టీ టాస్కింగ్ చేసేవారికి ఇబ్బంది లేకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను వాడారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో ఈ ఫోన్ వస్తోంది కాబట్టి.. సాఫ్ట్‌వేర్ పరంగా చాలా అప్‌డేటెడ్‌గా ఉంటుంది.

200 మెగాపిక్సల్ కెమెరా..

Advertisement

వివో ఫోన్ అంటేనే కెమెరా కదా. దీనిలో ఏకంగా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అమర్చారు. దీనికి OIS సపోర్ట్ ఉండటం వల్ల మనం నడుస్తూ ఫొటోలు తీసినా క్లారిటీ అస్సలు తగ్గదు. ఇక సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీంతో సోషల్ మీడియా ఫొటోల గురించి అస్సలు బెంగ పడక్కర్లేదు. దీనికి తోడు వివో సొంత AI ఫీచర్లు ఫొటోలను మరింత అందంగా మారుస్తాయి.

వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్..

Vivo V70 FEలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం 7,000mAh బ్యాటరీ. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నిశ్చింతగా ఉండొచ్చు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ బరువు కేవలం 200 గ్రాములే ఉండటం విశేషం. అలాగే 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం గంటలోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇకపోతే ఈ ఫోన్ వెనుక ప్యానెల్ చీకట్లో మెరుస్తుంది. అలాగే నీళ్లలో కూడా ఫొటోలు తీసుకునేలా దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఇచ్చారు. ఈ రేంజ్‌లో ఇన్ని ఫీచర్లు అంటే కచ్చితంగా ఇది బెస్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు.

Also Read: ఈ కొత్త ఫోన్ కొంటే.. రూ.6,000 డిస్కౌంట్‌తో పాటు రూ.2,000 విలువైన ఇయర్‌బడ్స్ ఫ్రీ!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×