E-Paper
Advertisement

Niharika Konidela: నాగబాబు సినిమాల పై నిహారిక షాకింగ్ కామెంట్స్…మోసం చేశారంటూ!

Niharika Konidela: నాగబాబు సినిమాల పై నిహారిక షాకింగ్ కామెంట్స్…మోసం చేశారంటూ!
Advertisement

Niharika Konidela: నిహారిక ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లేడీ ప్రొడ్యూసర్ గా నిహారిక ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె వెండితెరకు నిర్మాతగా పరిచయమయ్యారు. నిహారిక నిర్మాణంలో ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నిహారిక తన తదుపరి చిత్రం ఫాంటసీ కామెడీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్ నయన సారిక జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నిర్మాతగా నష్టపోయిన నాగబాబు..

ఈ నేపథ్యంలోనే నిహారిక పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు తన తండ్రి నాగబాబు(Nagababu) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. నాగబాబు కూడా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగిన సంగతి తెలిసిందే .ఈయన నిర్మాణంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వంటి వారందరూ కూడా సినిమాలు చేశారు. అయితే నాగబాబు సినిమాలకు నిర్మాతక వ్యవహరిస్తూ సంపాదించిన దానికంటే కూడా నష్టపోయింది ఎక్కువగా ఉందని చెప్పాలి. ఒకానొక సమయంలో నాగబాబు సినిమాలలో వచ్చిన నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అప్పుడు డిజాస్టర్ ..ఇప్పుడు సూపర్ సక్సెస్..

Advertisement

ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న నాగబాబు తన కుమార్తె నిహారిక కూడా నిర్మాతగా ఇండస్ట్రీలోకి వస్తుందని చెప్పగానే మీకు ఇచ్చిన సలహా ఏంటి అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్న నిహారిక సమాధానం చెబుతూ నాన్నకు నాపై నమ్మకం చాలా ఎక్కువ. నేను ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉంటానని తెలుసు అందుకే నన్ను ప్రోత్సహించారు తప్ప ఎక్కడ డిస్కరేజ్ చేయలేదని తెలిపారు. ఇక తన తండ్రి సినిమాల గురించి మాట్లాడుతూ నాన్న నిర్మించిన సినిమాలు కథల పరంగా చాలా అద్భుతంగా ఉన్నాయని కాకపోతే అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని తెలిపారు. అప్పట్లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ అవుతుంటే సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయని తెలిపారు.

అంచనాలు పెంచిన ట్రైలర్..

Advertisement

ఇక తన తండ్రి నిర్మాతగా కొనసాగిన సమయంలో సినిమాల పరంగా కూడా మోసపోయారని ఈ సందర్భంగా నిహారిక తెలిపారు. ఇలా నిహారిక తన తండ్రి సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాకాసా సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ ట్రైలర్ వీడియో ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని లాభాల బాటలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఏప్రిల్ మూడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నిహారికకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Niharika Konidela: నాగబాబు సినిమాల పై నిహారిక షాకింగ్ కామెంట్స్…మోసం చేశారంటూ!

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×