Swayambhu Film: హ్యాపీడేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నటుడు నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddarth) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన స్వయంభు(Swayambhu) అనే సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తీ అయ్యాయి కానీ ఈ సినిమా మొత్తం ఎక్కువగా విఎఫ్ఎక్స్ పనులతో కూడుకున్న నేపథ్యంలో విడుదల ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ సినిమాని శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 13వ తేదీన విడుదల చేయాలని భావించారు కానీ విఎఫ్ ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో వాయిదా పడుతోంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా స్వయంభు సినిమా డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి (Bharath Krishnamachari)ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో వారికి ఎదురైన ఒక భయంకరమైన పరిస్థితిని గురించి, ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలియచేశారు. స్వయంభు సినిమాలో యాక్షన్స్ సన్ని వేషాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కొంత భాగం రాజమండ్రి సమీపంలో ఉన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నిర్వహించారు. అయితే ఈ అటవీ ప్రాంతంలో ఇప్పటివరకు ఎవరు షూటింగ్ చేయని ఒక ప్రదేశానికి వెళ్లినట్టు తెలిపారు.
ఇలా ఎత్తైన కొండల ప్రదేశానికి వెళ్లాలి అంటే జీపులలో సుమారు మూడు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చేదని ఈయన తెలియజేశారు. ఇలా ఒక షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో అనుకోకుండా భారీ వర్షాలు పడటంతో మా సిబ్బంది మొత్తం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు . ఈ వర్షాల కారణంగా తాము రెండు రోజులపాటు కొండపైనే ఉండి పోవాల్సి వచ్చింది, కిందికి వెళ్లడానికి మార్గం లేక మా దగ్గర కనీస అవసరానికి సరిపడా వస్తువులు లేక భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని తెలిపారు.
అంచనాలు పెంచిన అప్డేట్స్..
ఈ సినిమా క్లైమాక్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో 80 రోజుల పాటు చిత్రీకరణ చేశామని ఇందులో భాగంగా రెండు భారీ బ్రిడ్జిలని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో ఒక బ్రిడ్జ్ ప్రత్యేకమైన క్రేన్లను ఏర్పాటు చేసి కూల్చి వేశామని భరత్ కృష్ణమాచారి తెలియచేశారు. ఇక ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ పతాకం పై భూవన్ శ్రీకర్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నిఖిల్ జోడిగా సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. ఈ సినిమా చారిత్రాత్మక యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ ఒక యోధుడిగా, న్యాయానికి, నీతికి ప్రతీక అయిన ‘సెంగోల్’ను రక్షించే బాధ్యత కలిగిన యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ అలాగే ఫస్ట్ సింగిల్ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుని సినిమా పట్ల అంచనాలను పెంచేసింది.
Also Read: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన యాటిట్యూడ్ స్టార్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే