E-Paper
Advertisement

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన యాటిట్యూడ్ స్టార్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన యాటిట్యూడ్ స్టార్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Advertisement

Barabar Premistha OTT: ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లో విడుదలైన 28 రోజులలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కానీ యాటిట్యూడ్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నటుడు చంద్రహాస్ (Chandrahas) నటించిన సినిమా ఏకంగా థియేటర్లలో విడుదలైన మూడు నెలలకు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి బరాబర్ ప్రేమిస్తా(Barabar Premistha) సినిమా ఏ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఎక్కడ చూడొచ్చు అని విషయానికి వస్తే.. యాటిట్యూడ్ స్టార్ నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్(Amazon prime Video) కొనుగోలు చేశారు.

విడుదలైన మూడు నెలలకు ఓటీటీలోకి..

ఈ సినిమా థియేటర్లలో విడుదలైన దాదాపు 3 నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 6 న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలకు మందు చంద్రహాస్ సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన విమర్శలపై కాస్త ఘాటుగా స్పందించడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ వివాదం కారణంగా ఈయనపై పోలీస్ కేసు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో వివాదాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

బూతు పాటతో వివాదం..

Advertisement

విలేజ్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ కామెడీ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో చంద్రహాస్ జోడిగా మేఘన ముఖర్జీ హీరోయిన్ గా నటించారు.సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా.. గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వేరరావు నిర్మించారు. ఇలా ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చంద్రహాస్ పాడిన బూతు పాట వివాదానికి కారణమైంది. ఈ పాటపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో చంద్రహాస్ వాటిపై రియాక్ట్ అవ్వడం ఈ వివాదం కాస్త పెద్దదై హీరో పై పోలీస్ కేసుల వరకు వెళ్లింది. ఈ ప్రభావం సినిమా పై భారీగా పడిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Advertisement

ఒక పల్లెటూరులో అందరితో సరదాగా గడుపుతూ ఉండే కుర్రాడు చందు (చంద్రహాస్) అదే ఊరిలో ఉన్న అమ్మాయి బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) తో ప్రేమలో పడతారు. అందరి ప్రేమ కథకు కులం, ఆస్తులు అడ్డు అయితే వీరిద్దరి ప్రేమకు మాత్రం ఊర్లో ఉన్న గొడవలు అడ్డంకిగా మారుతాయి. తమ ప్రేమకు అడ్డుగా మారిన ఊరి సమస్యలను చందు ఎలా ఎదుర్కొంటారు? ఆ సమస్యల నుంచి చందు బయటపడ్డారా? ఈ సమస్యలు సర్దుమనగడంతో తన ప్రేమను గెలిపించుకుంటారా? బుజ్జమ్మను సొంతం చేసుకుంటారా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇలా థియేటర్లలో విడుదల అయ్యి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో అయినా మంచి సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: అసూయ అంటే తెలియని వ్యక్తి ఆమె.. రష్మిక పై ప్రభాస్ బ్యూటీ కామెంట్స్!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×