E-Paper
Advertisement

Swayambhu : నిఖిల్ ‘స్వయంభు ‘ అప్డేట్ వచ్చేసింది.. నిర్మాతలు రిస్క్ తీసుకుంటున్నారా..?

Swayambhu : నిఖిల్ ‘స్వయంభు ‘ అప్డేట్ వచ్చేసింది.. నిర్మాతలు రిస్క్ తీసుకుంటున్నారా..?
Advertisement

Swayambhu : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారాడు.. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు చిత్రంలో నటిస్తున్నాడు. తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది.. మైథలాజికల్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ యుద్ధంలో వీరుడుగా నిలిచే రాజు పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు. షూటింగ్ అప్డేట్ ఇవ్వకుండా సినిమాను పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. ఈ క్రమంలో ఈ మూవీ బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ పెట్టి నిర్మాతలు రిస్క్ చేస్తున్నారేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మూవీ బడ్జెట్ ఎంత? నిఖిల్ లుక్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

భారీ బడ్జెట్ తో స్వయంభు..

నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న ఒక చారిత్రక నేపథ్యమున్న సినిమా స్వయంభు.. నిఖిల్ ఈ సినిమాలో ఒక యోధుడి (రాజు) పాత్రలో కనిపించనున్నారు.. సంయుక్తా మీనన్ మరియు నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పాన్-ఇండియా సినిమా, తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో సినిమాను తెరకేక్కిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఈ సినిమా విజువల్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారట.. బాహుబలి, RRR రేంజులో విజువల్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. ఈ విజువల్స్ కోసం చిత్ర యూనిట్ బడ్జెట్ విషయంలో వెనకడుగు వెయ్యడం లేదు.. నిఖిల్ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేస్తున్నారేమో.. తేడా కొడితే పరిస్థితి ఏంటి? అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి..

Advertisement

Also Read:
ప్రేమకు కోపం తెప్పించిన ధీరజ్.. భాగ్యం కొత్త ప్లాన్.. వల్లి సేఫ్ అవుతుందా..?

పవర్ ఫుల్ రాజుగా నిఖిల్.. 

హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నిఖిల్ గతంలో ఎన్నడు కనిపించిన విధంగా కనిపించనున్నాడు. అతని లుక్ సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. శక్తివంతమైన రాజుగా నిఖిల్ శత్రువుల మీద విరుచుకుపడే ఈ సీక్వెన్స్, విజువల్స్ పరంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని మేకర్స్ హింట్ ఇస్తున్నారు. ఈ సీన్ కోసం నిఖిల్ కత్తియుద్ధం, గుర్రపు స్వారీ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని తెలుస్తుంది. రవి బస్రూర్ సంగీతం, ముఖ్యంగా నిఖిల్ ఎంట్రీ సీన్ వద్ద ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని చెబుతున్నారు.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.. వచ్చే ఫిబ్రవరి 13 న సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.. గతంలో వచ్చిన కార్తికేయ 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది… మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×