Swayambhu Transformation: ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి డిఫరెంట్ మూవీస్ తో సత్తా చాటుకున్న నిఖిల్, 2022లో వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వచ్చిన ‘స్పై’ సినిమాతో బోల్తా పడ్డ ఈ యంగ్ హీరో, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ బడ్జెట్ హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక నిఖిల్ పుట్టినరోజును సందర్భంగా ‘స్వయంభూ’ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్ ఈ సినిమాలో నిఖిల్ ‘కృష్ణన్ రామన్’ అనే ఒక వీరుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఆఫ్‌స్క్రీన్‌లో పడ్డ కష్టాన్నిరివీల్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన ‘ట్రాన్స్‌ఫర్మేషన్ గ్లింప్స్’ వీడియోను రిలీజ్ చేసింది.
45 రోజుల పాటు కఠోరమైన శిక్షణ
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నిఖిల్ డెడికేషన్‌కు ఫిదా అయిపోతున్నారు. సాధారణంగా పీరియాడిక్ రోల్స్ అంటే కేవలం కాస్ట్యూమ్స్ మార్చడం మాత్రమే అనుకుంటారు, కానీ నిఖిల్ ఈ పాత్రలో ఒదిగిపోవడానికి, శారీరకంగా మానసికంగా ఎంతో పరిణతి సాధించడానికి ఏకంగా 45 రోజుల పాటు కఠోరమైన శిక్షణ తీసుకోవడం విశేషం.
పురాతన యుద్ధ విద్యలైన కత్తిసాము, కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ మరియు విలువిద్య (ఆర్చరీ) వంటి వాటిలో నిఖిల్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న దృశ్యాలు ఈ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. కేవలం కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయడం కాకుండా, ఒక నిజమైన యుద్ధ వీరుడి బాడీ లాంగ్వేజ్‌ను అలవర్చుకోవడానికి ఆయన రాత్రింబవళ్లు శ్రమించినట్టు వీడియో చూస్తేనే తెలుస్తుంది.
పవర్‌ఫుల్ వారియర్ లుక్ లో కనిపిస్తున్న నిఖిల్
ఈ శిక్షణ సమయంలో నిఖిల్ ఎన్నో గాయపడినప్పటికీ, సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఏమాత్రం వెనకడుగు వేయకుండా షూటింగ్‌ను కొనసాగించడం విశేషం. ఆ శ్రమ అంతా ఇప్పుడు ఆన్‌స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. గ్లింప్స్‌లో నిఖిల్ పవర్‌ఫుల్ వారియర్ లుక్, ఆయన కళ్లలో కనిపించే రౌద్రం ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.దీంతో అటు నెటిజన్లు,ఇటు సినీ సెలెబ్రిటీలు ఈ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సినిమా
ఈ భారీ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తుండగా,ఆయన విజన్‌కు తగ్గట్టుగా, ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్ మరియు శ్రీకర్ భారీ స్థాయిలో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన టాలెంటెడ్ బ్యూటీస్ నభ నటేష్ మరియు సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి పాత్రలు కూడా కథలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని సమాచారం. ‘కార్తికేయ 2’ సాధించిన పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సర్వం సిద్ధమవుతోంది.త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. నిఖిల్ గత చిత్రాల రికార్డులను బ్రేక్ చేస్తూ, ‘స్వయంభూ’ టాలీవుడ్ స్థాయిని మరోసారి ప్యాన్ ఇండియా లెవల్ కి తీసికెళ్ళిపోతుందని గట్టిగా నమ్ముతున్నారు మూవీ లవర్స్.చూడాలి మరి భారీ అంచనాలని మోస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి !
also read :నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు.. బాలీవుడ్ బ్యూటీ ఫ్యామిలీలో రూ.25 లక్షల భారీ చోరీ..