Sanjay Manjrekar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament ) అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ.. టీమిండియాలకు ( Team India) వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే బీసీసీఐ కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే టి20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ( Sanjay Manjrekar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆవేశపడి ఇప్పుడే టీమిండియాలోకి ( Team India) వైభవ్ సూర్యవంశీని అస్సలు తీసుకోకూడదని సూచనలు చేశారు. ఒకవేళ ఆ టీమ్ ఇండియాలోకి వైభవ్ సూర్యవంశీని ( Vaibhav Sooryavanshi) తీసుకుంటే ఆత్మహ**త్య చేసుకున్నట్లేనని బాంబు పేల్చారు. 15 ఏళ్ల బుడ్డోడి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని బీసీసీఐకి ( BCCI) కీలక సూచనలు చేశారు సంజయ్ మంజ్రేకర్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
త్వరలోనే టీమ్ ఇండియాలోకి వైభవ్ సూర్యవంశీ వస్తాడని వస్తున్న వార్తల నేపథ్యంలో బిసిసిఐకి కీలక సూచనలు చేశారు సంజయ్ మంజ్రేకర్. టీమిండియాలోకి వైభవ్ ను తీసుకొని.. నేరుగా ఆస్ట్రేలియా ( Australia), దక్షిణాఫ్రికా అలాగే ఇంగ్లాండ్ లాంటి విదేశీ ట్రాక్ లపైన ఆడిస్తే ప్రమాదమేనని హెచ్చరించారు. అలా చేస్తే ఆత్మహ**త్య చేసుకున్నట్లేనని బీసీసీఐపై ఫైర్ అయ్యారు. శ్రీలంక, ఇండియా లాంటి సబ్ కాంటినెంట్ మైదానాలపై బ్యాటింగ్ చేయడం వేరని… సేనా కంట్రీలలో ఆడడం డిఫరెంట్ అంటూ వ్యాఖ్యానించారు.
సేనా కంట్రీలలో ఆడిస్తే, వైభవ్ సూర్య వంశీ కెరియర్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందని హెచ్చరించారు. ఒత్తిడిని తట్టుకోలేక, అతని కెరీర్ నాశనం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. అతని వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమేనని… ఇలాంటి క్రమంలో కొన్ని రోజుల పాటు ఆగాల్సిందేనని సూచనలు చేశారు. అప్పుడే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడని వెల్లడించారు సంజయ్ మంజ్రేకర్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అదరగొట్టాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. 16 మ్యాచులు ఆడిన వైభవ్, 237 స్ట్రైక్ రేట్తో… ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. మొత్తం 776 పరుగులు సాధించిన వైభవ్… దాదాపు 45 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకోవడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా వైభవ్ సూర్యవంశీ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. వెంటనే వైభవ్ ను టీమిండియాలోకి తీసుకొని అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇలాంటి క్రమంలో టీమ్ ఇండియాలోకి వైభవ్ సూర్యవంశీని ( Vaibhav Sooryavanshi) తీసుకుంటే ఆత్మహ**త్య చేసుకున్నట్లేనని బాంబు పేల్చారు సంజయ్ మంజ్రేకర్.
Also Read: IPL 2026 Finals RCB VS GT: గుజరాత్ వర్సెస్ RCB మధ్య ఫైన ల్స్..ముందే ఊహించిన అనన్య బిర్లా, పాత పోస్ట్ వైరల్ IPL 2026 Finals RCB VS GT
Sanjay Manjrekar gives his verdict on the right conditions to hand Vaibhav Sooryavanshi his Indian senior team debut 🗣️#IPL2026 #India #VaibhavSooryavanshi #SanjayManjrekar #RR pic.twitter.com/qor5yDwpQ5
— CricTracker (@Cricketracker) June 2, 2026