Swayambhu Poster: న్యూ ఇయర్ 2026ను ఘనంగా స్వాగతిస్తూ స్వయంభు సినిమా టీమ్ ఒక పవర్‌ఫుల్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పింది. అదే సమయంలో ఈ సినిమా ఫిబ్రవరి 13, 2026 నుంచి థియేటర్లలో విడుదల కానుందని.. అధికారికంగా ప్రకటించింది. ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ పోస్టర్‌లో ఒక యోధుడు గుర్రం పక్కన నడుచుకుంటూ వెళ్లే సన్నివేశం కనిపిస్తుంది. సూర్యాస్తమయం నేపథ్యంలో ఉన్న విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్, లైటింగ్, నిఖిల్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈ సినిమా చరిత్ర..పురాణాల ఆధారంగా తెరకెక్కుతోందా మరో అద్భుతంగా కనిపిస్తుంది. “A true epic saga unfolds this 2026” అంతు క్యాప్షన్ కూడా షేర్ చేశాడు. ఇక దీంతో.. ఇది ఒక సాధారణ సినిమా కాదు.. ఒక పెద్ద థియేట్రికల్ అనుభవం అని మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు.
ఈ సినిమాలో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంతకుముందు చేయని ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే కార్తికేయ 2 …వంటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌పై. ఈ సినిమాతో మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కార్తికేయ 2 తరువాత నిఖిల్ కి పెద్దగా విజయాలు రాని సంగతి తెలిసిందే. కేవలం 18 పేజెస్ మాత్రమే పరవాలేదు అనిపించుకుంది. మిగతా సినిమాలు అన్ని ఫ్లాప్స్ గా మిగిలాయి.. అందుకే స్వయంభు చిత్రంపై ఆయన అభిమానులకి ఎన్ని భాషలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇది నిఖిల్ కెరీర్‌లోనే ఒక ముఖ్యమైన మైలురాయిగా మారుతుందని భావిస్తున్నారు.
ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ చరిత్ర, పురాణాలను ఆధునిక కథనంతో కలిపి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు.
Team #Swayambhu wishes a very Happy New Year 2026
In cinemas from February 13th pic.twitter.com/BfojqU7OFc
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) January 1, 2026
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ పెద్ద చర్చగా మారింది. సమాచారం ప్రకారం ఓవర్సీస్ రైట్స్ దాదాపు రూ.7 కోట్లుకి అమ్ముడయ్యాయి. ఇది నిఖిల్ కెరీర్‌లోనే హైయెస్ట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని కె.కె. సెంథిల్ కుమార్ చూసుకుంటున్నారు.
ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘స్వయంభు’ 2026లో ప్రేక్షకులకు ఒక గ్రాండ్ అనుభవాన్ని ఇవ్వబోతుందనే నమ్మకం సినిమా యూనిట్‌లో కనిపిస్తోంది.
ALSO READ: Stranger Things drone show: స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో.. కళ్లు చెదిరిపోతాయ్ వర్మ్