E-Paper
Advertisement

Railway New Rules: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై జర్నీ తేదీని మార్చేసుకోవచ్చు

Railway New Rules: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై జర్నీ తేదీని మార్చేసుకోవచ్చు
Advertisement

Railway New Rules: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు తమ రైలు రిజర్వేషన్లను ఎలాంటి రుసుము లేకుండా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. టికెట్ కన్ఫార్మ్ అయితే తర్వాత జర్నీ వాయిదా పడితే.. ప్రయాణి తేదీని మార్చుకోవచ్చు.

అయితే కేవలం రుసుములో తేడాను మాత్రమే చెల్లించి జర్నీ తేదీని మార్చుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. దీనిని ముందుగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ ద్వారా అమలు చేయాలని భావిస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని సమాచారం.

జర్నీ డేట్ మార్చుకోవచ్చు

Advertisement

ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను మార్చుకోడానికి అవకాశం లేదు. ఆ టికెట్ ను రద్దు చేసుకుని, ఆ తర్వాత కావాల్సిన తేదీకి బుక్ చేసుకోవాల్సి ఉండేది. ప్రయాణ తేదీలను షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు.

అయితే కొత్త వ్యవస్థలో ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి బుక్ చేసుకున్న టికెట్‌ను… సీట్లు అందుబాటులో ఉన్నంత వరకు వేరే ప్రయాణ తేదీ లేదా రైలును మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రయాణ ఛార్జీలలో వ్యత్యాసం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

దక్షిణ మధ్య రైల్వే కొత్త టైమింగ్స్

Advertisement

జనవరి 1వ తేదీ నుండి రైలు ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను చెక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. నేటి నుంచి రైళ్ల ప్రయాణ సమయాలలో మార్పు చేశారు. రైళ్లకు సంబంధించి.. మార్పుల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు.

సికింద్రాబాద్ లేదా కాచిగూడలో ప్రారంభమయ్యే లేదా ముగిసే 25 రైళ్లలో 8 రైళ్ల సమయాలను స్వల్పంగా మార్పులు చేశారు. రైళ్ల సమయాల్లో 5 నుంచి 30 నిమిషాల వ్యత్యాసం ఉండనుంది. అందుకే జనవరి 1 నుంచి రైలు ప్రయాణికులు ప్రయాణ సమయాలను ముందుగా చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

కొత్త టైమ్ టేబుల్

జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త టైమ్‌ టేబుల్‌ అమల్లోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. వివిధ స్టేషన్లలో 61 రైళ్లకు కొత్త స్టాప్‌లు రానున్నాయి. దీంతో మరింత మందికి రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది.

Also Read: సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్, స్టేషన్ల సమాచారం ఇదిగో

అలాగే ట్రాక్ డబ్లింగ్, ఇంటర్‌లాకింగ్, నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, సిగ్నలింగ్ అప్‌గ్రేడేషన్, కరెంట్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. రెండు రైళ్లను మెయిల్/ఎక్స్‌ప్రెస్ నుంచి సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. 89 రైళ్లకు వేగం పెంచారు. వివిధ స్టేషన్లలో 66 రైళ్ల రాక, బయలుదేరే సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×