E-Paper
Advertisement

ఆ లవ్ అఫైర్స్ నాకొద్దు అంటున్న క్రేజీ హీరోయిన్…ఆ ఆలోచనే లేదంటూ క్లియర్ కట్ వార్నింగ్!

ఆ లవ్ అఫైర్స్ నాకొద్దు అంటున్న క్రేజీ హీరోయిన్…ఆ ఆలోచనే లేదంటూ క్లియర్ కట్ వార్నింగ్!

Nikila Vimal: ట్రెండ్ మారుతుంది.ఈ మధ్య సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది.ఒకప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలానికే కెరీర్ కి ఎండ్ కార్డ్ వేసేవారు.కానీ ఈ తరంలోని అందాల భామలు అలా కాదు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా డిఫరెంట్ రోల్స్ తోప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటి విషయాలను ప్రస్తుతానికి పక్కన పెట్టేసి, కేవలం నటనపైనే పూర్తి ఫోకస్ పెడుతున్నారు. ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ పెళ్లి టాపిక్  వస్తేనే అప్పుడే ఆ ముచ్చట వద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తోంది యంగ్ బ్యూటీ నికిలా విమల్.

స్వయంకృషితో ఎదిగిన నికిలా విమల్

మల్లూ వుడ్ ఇండస్ట్రీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టిన నికిలా విమల్ ఆ తర్వాత స్వయంకృషితో మాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్‌లలో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా కోలీవుడ్ నాట  ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, నటిగా మంచి మార్కులే కొట్టేసింది.ముఖ్యంగా శశికుమార్ సరసన వెట్రివేల్, కిడారి వంటి చిత్రాలతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత పంచుమిట్టాయి, కార్తీతో కలిసి నటించిన తంబి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక 2022లో సక్సెస్ చూసిన  ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘పోర్ తొళిల్’ సినిమాలో నికిలా నటనని ఆకాశానికి ఎత్తేశారు ట్రేడ్ పండితులు.

తన దృష్టంతా సినిమాల చుట్టూనే

ఇదే ఊపులో ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వాళై’ చిత్రంలో ఒక డిఫరెంట్  రోల్ ప్లే చేసి అందరినీ మెప్పించింది.ఇలా వరుస సక్సెస్ లతో మూడు భాషల్లో బిజీగా గడుపుతున్న ఈ భామ తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, కెరీర్ ప్లాన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చింది. ఈ రోజుల్లో కెరీర్ లో నిలదొక్కుకోవడం అనేది చాలా ముఖ్యం అని, అందుకే తన దృష్టంతా సినిమాల చుట్టూనే తిరుగుతోందని స్పష్టం చేసింది.

లవ్ గురించి ఆలోచించేంత టైమ్ లేదు

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే, అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘మేడ మీద అబ్బాయి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కేరళ కుట్టి, ఇక్కడ కూడా మరికొన్ని మంచి ప్రాజెక్టులతో బిజీ అవ్వాలని చూస్తోంది. ఇదే క్రమంలో పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు నికిలా విమల్ చాలా ఓపెన్ గా, బోల్డ్ గా సమాధానం ఇచ్చింది. సాధారణంగా సెలబ్రిటీల లవ్ అఫైర్స్ పై నెట్టింట ఎప్పుడూ ఏవో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. కానీ తన మనసులో ఇప్పటివరకూ ఎవరూ లేరని, తాను ఎవరితోనూ ప్రేమలో లేనని క్లియర్ గా చెప్పేసింది. అసలు ప్రేమ, పెళ్లి అనేవి తన జీవితంలో అంత పెద్ద విషయాలే కాదని, వాటి గురించి ఆలోచించేంత టైమ్ కూడా ప్రస్తుతం తనకు లేదని తేల్చి చెప్పింది.

రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో 

భవిష్యత్తులో ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తే అప్పుడు చూసుకోవచ్చు కానీ, ప్రస్తుతానికి మాత్రం తన పూర్తి ఫోకస్ కేవలం వెండితెరపై తన మార్క్ చూపించడం మాత్రమేనని అంటోంది. హీరోయిన్లు కేవలం కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ డాల్స్ లా మిగిలిపోకుండా, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగడమే ఈ తరం ట్రెండ్ అని నికిలా విమల్ మాటలను బట్టి అర్థమవుతోంది. మరి అనంతన్ కాడు,దూమ కేతు సినిమాలతో  తెగ బిజీగా ఉన్న ఈ క్రేజీ బ్యూటీ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో !

also read :‘పెద్ది’ వివాదంపై అనసూయ భరద్వాజ్ సెన్సేషన్ కామెంట్స్…. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!

Related News

ప్రశ్నించడం మా హక్కు.. నాగబాబుకు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్..

‘పెద్ది’ వివాదంపై అనసూయ భరద్వాజ్ సెన్సేషన్ కామెంట్స్…. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!

విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’ క్రేజీ అప్‌డేట్.. 100 రోజుల షూటింగ్ పూర్తి, రిలీజ్ ఎప్పుడంటే?

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో ఆ సీన్స్ డిలీట్.. బుచ్చిబాబు షాకింగ్ డెసిషన్!

రామ్‌చరణ్ ఊచకోత.. 48 గంటల్లోనే రూ. 181 కోట్లు. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!

బడ్జెట్ తక్కువ సినిమాలు.. బ్లాక్ బాస్టర్ రిజల్ట్..!

యానిమల్ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అయ్యో అంత బాధపడిందా..?

Big Stories

×