E-Paper
Advertisement

‘పెద్ది’ వివాదంపై అనసూయ భరద్వాజ్ సెన్సేషన్ కామెంట్స్…. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!

‘పెద్ది’ వివాదంపై అనసూయ భరద్వాజ్ సెన్సేషన్ కామెంట్స్…. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!
Advertisement

Peddi Controversy: ఒకవైపు వసూళ్ళ వర్షం కురిపిస్తూనే మరో వైపు కాంట్రవర్సీలకి కేరాఫ్ గా నిలుస్తుంది పెద్ది. యస్..రెండో రోజుకి ఏకంగా 181 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పాత్రను కేవలం గ్లామర్ కోసమే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. గతంలో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాలో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీకి, ఇందులోనూ కేవలం కమర్షియల్ హంగుల కోసమే తీసుకున్నారనే టాక్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన కొన్ని ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారాయి.

సోషల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోవద్దన్న అనసూయ 

సినిమా అనేది కేవలం సమాజానికి ఒక ప్రతిబింబం మాత్రమేనని, సమాజాన్ని మార్చే పూర్తి బాధ్యతను సినిమా పరిశ్రమపైనే నెట్టేయడం కరెక్ట్ కాదని అనసూయ అభిప్రాయపడ్డారు. వెండితెరపై ఏది మంచి, ఏది చెడు అని విశ్లేషించుకునే విచక్షణ ప్రేక్షకులకు ఉండాలని ఆమె హితవు పలికారు. సినిమాలను చూస్తూ, వాటిని రోల్ మోడల్‌గా తీసుకుని పిల్లలను పెంచడం సరైన పద్ధతి కాదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో, కథలు రాసే రచయితలు, దర్శకులు కూడా తమ సామాజిక బాధ్యతను మర్చిపోకూడదని ఆమె హెచ్చరించారు. ఎందుకంటే ప్రజల ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చే అపారమైన శక్తి సినిమాకు ఖచ్చితంగా ఉంటుందని గుర్తుచేశారు.

సినిమా తీసేవాళ్లకు, చూసేవాళ్లకు సమానంగా వర్తిస్తుంది

Advertisement

ఒకప్పుడు సినిమాల్లో పాత్రల చిత్రణ చాలా స్పష్టంగా ఉండేదని, హీరో అంటే మంచివాడని, విలన్ అంటే చెడ్డవాడని ప్రేక్షకుడికి తేలికగా అర్థమయ్యేదని అనసూయ విశ్లేషించారు. కానీ ఈ రోజుల్లో పాత్రల రూపకల్పన తీవ్ర గందరగోళంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెరపై ఒక చెడును కేవలం చూపించారా? లేక ఆ చెడునే గ్లోరిఫై చేస్తూ గొప్పగా ఎలివేట్ చేసి చూపించారా? అనే తేడాను గుర్తించలేనంతగా నేటి సినిమాలు ఉంటున్నాయని పెదవి విరిచారు. తాను ఇలాంటి విషయాలపై నోరు విప్పినప్పుడు కొందరు ఇండస్ట్రీ వాళ్లు తనను తప్పుబడుతుంటారని, కానీ తన ఉద్దేశం సినిమాలను ఆపడం కాదని, సమాజం పట్ల అందరికీ ఒక కనీస బాధ్యత ఉండాలనేదే తన తాపత్రయమని స్పష్టం చేశారు. ఈ రూల్ సినిమా తీసేవాళ్లకు, చూసేవాళ్లకు సమానంగా వర్తిస్తుందన్నారు.

సరైన అవకాశాలు రాలేవన్న వెటరన్ బ్యూటీ 

Advertisement

తన కెరీర్‌లో ఎన్నో ఆఫర్లు వదులుకోవడానికి కూడా ఈ నమ్మకాలే కారణమని అనసూయ సంచలన నిజాలను బయటపెట్టారు. గతంలో ఒక పెద్ద రియాలిటీ టీవీ షో నుండి తాను తప్పుకోవడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు. తన అభిప్రాయాల వల్ల షో క్రియేటివిటీ దెబ్బతింటుందని కొందరు అన్నారని, ఆ తర్వాత తనకి నటించే కెపాసిటీ
ఉన్నా కూడా సరైన అవకాశాలు రాకుండా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.అయినప్పటికీ తాను నమ్మిన నిజం కోసం నిలబడటంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని గర్వంగా ప్రకటించారు.

ఎలాంటి కాంట్రవర్సీకి దారి తీస్తాయో

సినిమాల్లోని లోపాలను, అడల్ట్ కంటెంట్ పై సోషల్ మీడియాలో తనదైన గళం విప్పుతున్న నేటి తరం నెటిజన్లను ఆమె మనస్ఫూర్తిగా అభినందించారు. తప్పును ప్రశ్నించడం అంటే సినిమా క్రియేటివ్ స్వేచ్ఛను అడ్డుకోవడం కాదని, అది సమాజంలో ఒక ఆరోగ్యకరమైన మార్పుకు దారితీస్తుందని తెలిపారు.సినిమా తీసే స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, సమాజం పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసిన అనసూయ.. ఇకనైనా సినీ సెలబ్రిటీలు, చూసే ప్రేక్షకులు మరింత మెచ్యూర్డ్‌గా, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.చూడాలి మరి పెద్ది పై అనసూయ చేసిన ఈ ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ఎలాంటి కాంట్రవర్సీకి దారి తీస్తాయో !

also read :విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’ క్రేజీ అప్‌డేట్.. 100 రోజుల షూటింగ్ పూర్తి, రిలీజ్ ఎప్పుడంటే?

Related News

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!

ఒకే సినిమాలో 12 పాత్రలు.. కమల్ హాసన్‌ను మించిపోయిన ప్రియాంక చోప్రా!

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

Big Stories

Advertisement
×