E-Paper
Advertisement

Vamsi Goud: నల్గొండ జిల్లా గీత కార్మికుడి కొడుకు.. తెలంగాణ తరపున ఢిల్లీలో సంచలనం..!

Vamsi Goud: నల్గొండ జిల్లా గీత కార్మికుడి కొడుకు.. తెలంగాణ తరపున ఢిల్లీలో సంచలనం..!

Vamsi Goud: స్వేచ్చ బ్యూరో: నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక విద్యార్థి చేతికి.. ఆకలి నేర్పిన కష్టం ఒక వైపు, అక్షరాలు నేర్పిన క్రమశిక్షణ మరోవైపు తోడయ్యాయి. వీటన్నింటికీ మించి, గుండెల్లో గూడుకట్టుకున్న చిత్రకళా తృష్ణ అతని చేతికి ఒక కుంచెను అందించింది. ఆ కుంచె తో అతను గీసిన గీతలు కేవలం బొమ్మలు కావు అతని కలల ప్రయాణం, కన్నవారి చెమట చుక్కల ప్రతిరూపాలు. ఆ యువకుడే నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన అసాధారణ చిత్రకారుడు డెంకెం వంశీ గౌడ్.

తాటిచెట్టు పైనుంచి తండ్రి శ్రమ.. కుట్టు మిషన్ సవ్వడితో తల్లి ఆసరా..

వంశీ గౌడ్‌‌ది అత్యంత సామాన్యమైన నిరుపేద కుటుంబం. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన డెంకెం యాదయ్య గౌడ్, సైదమ్మ దంపతుల కుమారుడు వంశీ. తండ్రి యాదయ్య గౌడ్ తన కులవృత్తి అయిన తాటి చెట్లను ఎక్కుతూ, ప్రాణాలను ఫణంగా పెట్టి కష్టపడుతుంటారు. ఆ కాయకష్టం ద్వారానే ముగ్గురు పిల్లలు, భార్య ఉన్న ఆ చిన్న సంసారాన్ని ఎంతో బాధ్యతగా పోషిస్తున్నారు. తండ్రికి తోడుగా, తల్లి సైదమ్మ టైలరింగ్ (బట్టలు కుడుతూ) చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కూడా, కొడుకు చేతిలో ఉన్న చిత్రకళా నైపుణ్యాన్ని ఈ తల్లిదండ్రులు గుర్తించారు. తమ గ్రామ పరిధిలోనే కాకుండా, కొడుకు ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదని వంశీని నిరంతరం ప్రోత్సహిస్తూ కొండంత అండగా నిలిచారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల..

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వంశీ ప్రాథమిక విద్యాభ్యాస మంతా ప్రభుత్వ సంస్థల్లోనే సాగింది. తుంగతుర్తిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలుర) లో 1 నుండి 10వ తరగతి వరకు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించారు. అనంతరం నల్లగొండలోని ఆల్ఫా జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ప్రస్తుతం నల్లగొండలోని ప్రముఖ ఎన్.జి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో ఉన్నత చదువులు చదువుతున్నారు. చదువుతో పాటు తనలోని కళను నిరంతరం సానబెట్టుకుంటూ వచ్చారు.

Also Read: గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!

అందమైన చిత్రాలు.

చిన్ననాటి నుంచే డ్రాయింగ్ అంటే ప్రాణంగా భావించే వంశీ గౌడ్, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను గీయడంలో అద్భుతమైన నైపుణ్యాన్ని సంపాదించారు. దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను తన కుంచెతో కాగితంపై సజీవంగా ఆవిష్కరిస్తున్నప్పుడు అతనిలోని దేశభక్తి కనిపిస్తుంది. కేవలం అందమైన చిత్రాలే కాకుండా, సమాజానికి ఉపయోగపడేలా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) నిర్వహించిన ‘ఆర్ట్ ఫర్ లైఫ్-రోడ్ సేఫ్టీ ఛాలెంజ్’ లో పాల్గొని రోడ్డు భద్రతపై తన చిత్రాల ద్వారా సామాజిక అవగాహన కల్పించారు. అలాగే నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన జిల్లా స్థాయి యువ ఉత్సవ్ (2024-25), వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డ్రాయింగ్ పోటీలలో పాల్గొని కట్టంగూర్ పేరును జిల్లా వ్యాప్తంగా చాటారు.

ఢిల్లీ భారత్ మండపంలో మెరిసిన వంశీ ప్రతిభ..

ఒక సాదాసీదా గీత కార్మికుని కొడుకుగా కట్టంగూర్‌‌లో ప్రస్థానాన్ని ప్రారంభించిన వంశీ, తన అసాధారణ నైపుణ్యంతో దేశ రాజధాని ఢిల్లీ వరకు ఎదిగారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ‘భారత్ మండపం’ లో నిర్వహించిన ‘విక్సిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ – 2026’ లో పాల్గొనడం వంశీ కళా ప్రస్థానంలో ఒక మైలురాయి. ఎందరో లబ్దప్రతిష్ఠులు, దేశ విదేశీ ప్రతినిధులు నడిచిన ఆ వేదికపై ఒక నిరుపేద గ్రామీణ యువకుడు దేశ యువ నాయకత్వ చర్చల్లో భాగస్వామ్యం కావడం నల్లగొండ జిల్లాకే కాక, యావత్ తెలంగాణకే గర్వకారణం.

ప్రతిభకు సంకెళ్లా..

తండ్రి చేతి గీస కత్తి.. తల్లి చేతి కుట్టు మిషన్ సూది వంశీ చేతిలోని రంగుల కుంచెగా మారాయి. కన్నవారి కష్టాన్ని కళ్లారా చూసిన వంశీ, ఎక్కడా అధైర్యపడకుండా ఆ కష్టాన్నే తన గెలుపునకు ఇంధనంగా మార్చుకున్నాడు. పేదరికం ప్రతిభకు సంకెళ్లు వేయలేదని నిరూపించిన డెంకెం వంశీ గౌడ్ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించి, తన తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని, కన్నభూమికి గొప్ప కీర్తిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం!

Also read: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!

Related News

Jagga Reddy: ఆధార్ కార్డు ఇస్తే చాలు.. మీ ఇంటికి సైకిల్ వస్తుంది: జగ్గారెడ్డి!

ఖమ్మం నగరానికి నయా లుక్.. సిద్ధమైన తీగల వంతెన.. తుది మెరుగులు చూసారా..!

Suryapet: సూర్యాపేట మున్సిపాలిటీకి దక్కిన.. రాష్ట్రస్థాయి అరుదైన గౌరవం..?

Revenue Corruption: పైకి నెంబర్ వన్ అధికారి.. లోపల రైతుల రక్తం తాగుతున్న వైనం.. ఆ తహసీల్దార్ అసలు రంగు ఇదీ!

Ward Meetings: అలియాబాద్‌లో ప్రజా పాలన సభలు.. మున్సిపల్ చైర్మన్ హడావుడి!

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పొడగింపు.. ఎప్పటివరకు అంటే?

భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!

Big Stories

×