E-Paper
Advertisement

నితిన్-సితార ‘క్రేజీ’ కాంబో షురూ.. ఈసారైనా లక్ మారుతుందా?

నితిన్-సితార ‘క్రేజీ’ కాంబో షురూ.. ఈసారైనా లక్ మారుతుందా?
Advertisement

Nithiin Movie : వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ అచ్చొచ్చిన బ్యానర్లో సినిమా మొదలెట్టేశాడు.’అఆ’ (2016),’భీష్మ’ (2020) వంటి సాలిడ్ హిట్స్ ఇచ్చిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో తాజాగా సరికొత్త సినిమాని ఈరోజే అంటే మే 6న హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోలో పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి సినిమా యూనిట్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రెటీలు అటెండ్ అయి మూవీ టీమ్ కి తమ విషెస్ తెలిపారు.ఇక ఇప్పటికే రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చిన బ్యానర్ కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఒక సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ 

Advertisement

ఇక మాములుగా ఒక సినిమాకి ఒక దర్శకుడే ఉంటాడు.కానీ ఈ సినిమాకి నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ యాక్షన్ చెప్పబోతుండటం విశేషం.వీరిద్దరూ కలిసి ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అంటేనే క్వాలిటీకి కేరాఫ్. దానికి తోడు ఇద్దరి దర్శకుల విజన్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని ఫిలిమ్ సర్కిల్స్ వినిపిస్తున్న టాక్.

also read :సత్యారెడ్డికి ఘన సన్మానం..హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘కింగ్ బుద్ధ’ పై క్రేజీ అప్‌డేట్

Advertisement

రితికా నాయక్ బ్యూటీ.. సురేష్ బొబ్బిలి మ్యూజిక్

ఇక సినిమాలో నితిన్ కి జోడీగా మిరాయ్,’అశోకవనంలో అర్జున కళ్యాణం’సినిమాలతో అలరించిన రితికా నాయక్ హీరోయిన్ గా కనిపించనుంది.ఇక నీది నాదీ ఒకే కథ, విరాటపర్వం వంటి సినిమాలకి మ్యూజిక్ అందించిన సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మదాడి, ఆర్ట్ డైరెక్టర్ గా జానీ షేక్ ఈ సినిమాలో భాగం కానున్నారు.

మే రెండో వారం నుంచి యాక్షన్ షురూ..

ఇక ముహూర్తంతోనే ఆగిపోకుండా సినిమాని త్వరలో మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ షూటింగ్ షెడ్యూల్స్ ను కూడా ఫిక్స్ చేసేయడం విశేషం.మే రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, స్పీడ్ గా షూట్ కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

సక్సెస్ ఫుల్ కాంబినేషన్ – అదిరే అంచనాలు

ఇక సినిమా విషయానికి వస్తే సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ బ్యానర్ లో ఇప్పటికే వచ్చిన ‘డీజే టిల్లు’, ‘సార్’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు కొల్లగొట్టాయో చెప్పక్కర్లేదు. మరి వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ కి ఈసారైనా అచ్చొచ్చిన బ్యానర్ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది కాలమే డిసైడ్ చేయాలి.

also read :90కి పైగా అద్భుత చిత్రాలు, 34 దర్శకులకు ఛాన్సులు.. సూపర్ గుడ్ చౌదరి స్పెషాలిటీ ఇదే!

 

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×