E-Paper
Advertisement

90కి పైగా అద్భుత చిత్రాలు, 34 దర్శకులకు ఛాన్సులు.. సూపర్ గుడ్ చౌదరి స్పెషాలిటీ ఇదే!

90కి పైగా అద్భుత చిత్రాలు, 34 దర్శకులకు ఛాన్సులు.. సూపర్ గుడ్ చౌదరి స్పెషాలిటీ ఇదే!
Advertisement

RB Choudary : రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి..ఈ పేరు చెబితే టక్కున ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కాని ఆర్.బి. చౌదరి అనగానే గుర్తు పట్టని వారుండరంటే ఆశ్చర్యం లేదు. సినిమా ఇండస్ట్రీపై ఆయన వేసిన ముద్ర అలాంటిది.అయితే దురదృష్టవశాత్తు ఈరోజు (మే 5, 2026) రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఈ క్రమంలో ఆర్.బి. చౌదరి గురించి మరోసారి తలుచుకుంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్.మరి ఆర్.బి. చౌదరి సినీ ప్రస్థానం ఏంటో, అసలు ఎలా మొదలైందో చూసేద్దామా !

అసలు పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి

Advertisement

సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేతగా పేరుగాంచిన ఆర్.బి. చౌదరి అసలు పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి.పిబ్రవరి15 1947లో రాజస్థానీ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. క్రమంగా ఉక్కు (Steel), ఎగుమతులు మరియు నగల వ్యాపారం చేస్తూ రాజస్తాన్ నుండి చెన్నై చేరారు. బిజినెస్ లో సక్సెస్ కావడంతో సినిమాల పై ఉన్న ఇష్టంతో 1980వ సంవత్సరం చివరిలో మలయాళ సినీ ఇండస్ట్రీ ద్వారా ప్రొడ్యూసర్ గా తన జర్నీని మొదలుపెట్టారు.అలా ‘సూపర్’ అనే బ్యానర్‌పై ‘అడిపాపం’ (1988), ‘లయనం’ (1989) వంటి సినిమాలని నిర్మించారు.ఇక ఆతర్వాత 1989లో తమిళ ఇండస్ట్రీకి వచ్చి, అప్పట్లో పాపులర్ అయిన ‘గుడ్ నైట్’ మస్కిటో మ్యాట్స్ అధినేత ఆర్. మోహన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయినప్పుడు తన బ్యానర్ పేరులోని ‘సూపర్’కు, మోహన్ సంస్థ పేరులోని ‘గుడ్’ను కలిపి ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ను స్థాపించారు.మనం ఇప్పుడు చూస్తున్న సూపర్ గుడ్ ఫిల్మ్స్ వెనుకున్న స్టోరీ అదన్న మాట.

also read :రాహుల్ గాంధీతో పెళ్లా? కంగనా రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!

Advertisement

‘పుదు వసంతం’ తొలి భారీ విజయం 

ఇక 1990లో విడుదలైన ‘పుదు వసంతం’ ఈ బ్యానర్‌కు తొలి భారీ విజయాన్ని అందించడమే కాకుండా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ చిత్ర అవార్డును మరియు ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టడం విశేషం.ఇక తెలుగులో ఆయన ప్రస్థానం 1994లో ‘కెప్టెన్’ సినిమాతో మొదలైనప్పటికీ, 1998లో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘సుస్వాగతం’ ఆయనకు ఎక్కడ లేని ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.ఇక అదే ఏడాది విడుదలైన వెంకటేష్ ‘సూర్యవంశం’ (1998) ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందుకోవడంతో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

 కుటుంబంతో కలిసి చూడదగ్గ ఎన్నో మంచి సినిమాలు

ఇక అచ్చొచ్చిన వెంకీ తో 1999లో ‘రాజా’చేయగా దీనికి కూడా బెస్ట్ ఫిలిమ క్యాటగిరీలో ఫిలింఫేర్ అవార్డు లభించడం విశేషం. ఇక 2000వ సంవత్సరంలో నాగార్జునతో ‘నువ్వు వస్తావని’, ‘నిన్నే ప్రేమిస్తా’ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ కొట్టి హిట్ సినిమాలకి కేరాఫ్ అయిపోయారు. ఆ తర్వాత ‘ప్రియమైన నీకు’ (2001), ‘స్నేహమంటే ఇదేరా’ (2001), ‘శివరామరాజు’ (2002), ‘సంక్రాంతి’ (2005), ‘అన్నవరం’ (2006), ‘గోరింటాకు’ (2008), ‘రచ్చ’ (2012) అంటూ బ్యానర్ కు తగినట్లే కుటుంబంతో కలిసి చూడదగ్గ ఎన్నో మంచి మంచి సినిమాలని ప్రొడ్యూస్ చేసి సినిమాపై తనకెంత ప్యాషన్ ఉందో ప్రూవ్ చేసుకున్నారు.అలా ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలు సోషల్ మెసేజ్ ఇస్తూనే ఫ్యామిలీ వాల్యూస్ కిపెద్దపీట వేసేవని చేసిన సినిమాలని చూస్తేనే   తెలుస్తుంది . ఇక 2022లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ని కూడా ఆర్.బి. చౌదరే నిర్మించడం ఒక విశేషం అయితే ఆ సినిమా వారి బ్యానర్ కి 90వ సినిమా కావడం మరో విశేషం.

also read :దళపతి ‘విశ్వరూపం’.. 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

34 మందికి పైగా దర్శకులకి అవకాశం 

అయితే ఆర్.బి. చౌదరి కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా, కొత్త టాలెంట్ ని కూడా జల్లెడ పట్టడంలో దిట్టనే చెప్పాలి. ఇపుడు మనం గొప్ప డైరెక్టర్స్ గా చెప్పుకుంటున్న కె.ఎస్. రవికుమార్, విక్రమన్, ఎన్. లింగుస్వామి, ఎస్.జె. సూర్య వంటి 34 మందికి పైగా దర్శకులను ఆయనే సినీ ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేశారంటే న్యూ టాలెంట్ కి ఎంతటి పట్టం కట్టారో అర్థమవుతుంది.

వ్యక్తిగత జీవితానికి వస్తే

ఇక ఆర్.బి. చౌదరి వ్యక్తిగత జీవితానికి వస్తే తమిళనాడు కి చెందిన వనిత మహెజబీన్‌ను పెళ్లి చేసుకాగా, వీరికి ఆయనకు నలుగురు కుమారులు .పెద్ద కుమారుడు బి. సురేష్ ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాలు చూస్తుండగా, రెండో కుమారుడు జీవన్ బిజినెస్ లో కొనసాగుతున్నారు.ఇక మూడో కుమారుడు జితన్ రమేష్ మరియు చిన్న కుమారుడు జీవా నటులుగా సత్తా చాటుతున్నారు.ముఖ్యంగా మనల్ని ఎంతగానో అలరించిన రంగం సినిమాలో హీరోగా చేసింది ఈ జీవానే.

100వ చిత్రాన్ని దళపతి విజయ్‌తో నిర్మించాలని కల

త సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లో, R B చౌదరి నిర్మిస్తున్న 99వ చిత్రం మకుటం. విశాల్ (Vishal) హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది  .ఇక ఆర్.బి. చౌదరి 100వ చిత్రాన్ని దళపతి విజయ్‌తో నిర్మించాలని కలలుగన్నారు. కానీ దురదృష్టవశాత్తు కోరిక నెరవేరకుండానే నేడు (మే 5, 2026) రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ పై ఎన్నో సినిమాలు చేసి ఏంతో మందికి జీవితాన్ని ఇచ్చిన ఆర్.బి. చౌదరి 79 ఏళ్ల వయసులో  ఇలా మరణించడం దక్షిణాది చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా తెలుగు మరియు తమిళ సినీ రంగానికి తీరని లోటనే చెప్పాలి.

also read :బాలయ్య సినిమాపై వైరల్ అవుతున్న క్రేజీ రూమర్స్.. నిప్పు లేనిదే పొగ రాదుగా!

Related News

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

Big Stories

Advertisement
×