E-Paper
Advertisement

Nithiin : ఆ విలక్షణ దర్శకుడు తో నితిన్ సినిమా, ఇతనైన హిట్ ఇస్తాడా?

Nithiin : ఆ విలక్షణ దర్శకుడు తో నితిన్ సినిమా, ఇతనైన హిట్ ఇస్తాడా?
Advertisement

Nithiin : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ నటులలో నితిన్ ఒకడు. జయం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. తేజ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోకి దక్కని అదృష్టం నితిన్ కు దక్కింది.

చిన్న దర్శకులతో పాటు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, వివి వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ తో కూడా పనిచేసిన అనుభవం నితిన్ కు ఉంది. అదృష్టవశాత్తు ఈ దర్శకులు అందరూ కూడా నితిన్ కి మంచి సక్సెస్ఫుల్ సినిమాలే ఇచ్చారు. అయితే నితిన్ కెరియర్లో హిట్ సినిమాలు కంటే కూడా డిజాస్టర్ సినిమాలు విపరీతంగా ఉన్నాయి. వరుస ఫెయిల్యూర్ సినిమాలు వస్తున్న తరుణంలో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ అనే సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Advertisement

పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఆడియో లాంచ్ కు గెస్టుగా హాజరయ్యారు. అప్పుడే పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి ఎంత ఇష్టమో చెప్పాడు. ఇక్కడితో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నితిన్ సినిమాలను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు.

ఆ విలక్షణ దర్శకుడు తో 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉన్న దర్శకులు కొంతమంది ఉన్నారు. వాళ్లలో విఐ ఆనంద్ ఒకరు. సందీప్ కిషన్ హీరోగా చేసిన ఊరు పేరు భైరవకోన సినిమాతో రీసెంట్ గా సక్సెస్ అందుకున్నారు ఆనంద్.

Advertisement

ఇప్పుడు నితిన్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు డైరెక్టర్ రివిల్ చేశాడు. అల్లరి నరేష్ నటించిన రైల్వే కాలనీ సినిమా ఈవెంట్ కి హాజరైన ఆనంద్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణలో నితిన్ హీరోగా ఆనంద్ దర్శకుడిగా సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు.

హిట్ అందిస్తాడా? 

బాక్స్ ఆఫీస్ వద్ద నితిన్ సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన తమ్ముడు సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమా చేస్తాడు అని అధికారకంగా ప్రకటన కూడా చేశారు. కానీ ఆ ప్రాజెక్టు తప్పిపోయింది.

కనీసం విలక్షణ దర్శకుడు ఆనంద్ నితిన్ కి సక్సెస్ ఇస్తాడేమో వేచి చూడాలి. మరోవైపు మైత్రి మూవీ మేకర్, 70mm బ్యానర్ లో కూడా నితిన్ ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఏ ప్రాజెక్టు కూడా నితిన్ అనౌన్స్ చేయలేదు.

Also Read: Ramya Krishna: రాజశేఖర్ సరసన రమ్యకృష్ణ, ఓటీటీ లో ఉన్న సినిమాకి అవసరమా?

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×