Ramyakrishna: ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయడం తగ్గించాడు కానీ ఒకప్పుడు రాజ శేఖర్ కు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్. అప్పట్లో రాజశేఖర్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా బ్రహ్మరథం పట్టేవాళ్ళు. రాజశేఖర్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నిటికీ కూడా మంచి పేరు వచ్చింది.
రీసెంట్ టైమ్స్ లో రాజశేఖర్ చేసిన సినిమాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కాలంలో రాజశేఖర్ కేవలం హీరోగా మాత్రం సినిమాలు చేయడమే కాకుండా నటుడుగా కూడా చేయడం మొదలుపెట్టాడు. అయితే ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేయకుండా కొన్ని సెలెక్టివ్ పాత్రలను చేస్తూ తన కెరియర్ ముందుకు సాగిస్తున్నాడు.
హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ కూడా ఆమె అందం చెక్కుచెదరలేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు కొన్ని కీలకమైన పాత్రల్లో కనిపిస్తున్నారు రమ్యకృష్ణ.
బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఆవిడకు విపరీతమైన పేరు తీసుకొచ్చింది. కొన్ని పాత్రను చేసేటప్పుడు ఆ పాత్రలో ఇమిడిపోతారు. బయట కనిపించినప్పుడు మాత్రం ఇంత అందాన్ని ఎలా మైంటైన్ చేస్తున్నారో అనిపిస్తారు.
ఇప్పుడు రమ్యకృష్ణ రాజశేఖర్ సరసన ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో మంచి సక్సెస్ సాధించిన లబ్బర్ పండు అనే సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అదే సినిమాలో రాజశేఖర్ తో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు. అలానే రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
ఈరోజుల్లో ఒక సినిమా రీమేక్ చేయడం అనేది అంత సరైన నిర్ణయం కాదు. అది కాకుండా ఆ సినిమా ఆల్రెడీ హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాని చూసేశారు. ఆల్రెడీ చూసేసాం సినిమాని మళ్లీ థియేటర్కు వచ్చి చూస్తారు అనే నమ్మకాలు చాలా తక్కువ. అయితే మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో సినిమాను చేస్తున్నారు తెలియదు. అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది వాళ్లు రియాక్ట్ అయితే ఒక క్లారిటీ వస్తుంది.
ఒకవేళ ఈ సినిమాను రీమేక్ చేస్తే ఎటువంటి మార్పులు చేస్తారు అనే క్యూరియాసిటీ కూడా ఉంది. ఉన్నది ఉన్నట్లుగా సినిమా చేయాలి అంటే అది అనవసరం. సినిమా చూసి చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా వేశారు.
Also Read: 12A Railway Colony : సినిమాకు డ్యూరేషన్ ఒకే , ఇంతకీ కంటెంట్ పరిస్థితి ఏంటి?