E-Paper
Advertisement

Bimbisara 2: బింబిసారా 2 వున్నట్టా.. లేనట్టా.. అసలేం జరుగుతోంది?

Bimbisara 2: బింబిసారా 2 వున్నట్టా.. లేనట్టా.. అసలేం జరుగుతోంది?

Bimbisara 2:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Nandamuri Hero Kalyan Ram). ఒకవైపు హీరోగా, మరొకవైపు నిర్మాతగా పలు చిత్రాలను నిర్మిస్తున్న ఈయన.. అప్పుడప్పుడు విభిన్నమైన జానర్లలో సినిమాలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. అంతేకాదు తన చిత్రాల ద్వారా నూతన దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నార. అలా వశిష్ట మల్లిడి నూతన పరిచయంలో ఇండస్ట్రీకి పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం బింబిసార.. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడి కథ నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా 2022 ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

బింబిసారా సీక్వెల్ ఉన్నట్టా? లేనట్టా?

సంయుక్త మీనన్ (Samyuktha menon), కేథరిన్ థ్రేసా(Catherine tresa) హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మించారు.. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి , తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, ప్రకాష్ రాజ్, గాయత్రి భార్గవి , హర్ష చెముడు తదితరులు కీలకపాత్రలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ పై అప్పట్లోనే అంచనాలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలై నాలుగేళ్లు పైగానే అవుతున్నా ఈ సినిమా సీక్వెల్ పై ఎటువంటి అధికారిక అప్డేట్ లేకపోవడంతో అభిమానులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు బింబిసారా సీక్వెల్ ఉందా? లేదా? అసలు ఈ చిత్రంపై ఎందుకు మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

అనుమానాలు పెంచుతున్న బింబిసారా సీక్వెల్..

అసలు విషయంలోకి వెళ్తే.. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన అమీగోస్, ది డెవిల్, సన్నాఫ్ వైజయంతి వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అందులో భాగంగానే ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్న కళ్యాణ్ రామ్ తాజాగా ప్రముఖ రచయిత శ్రీకాంత్ విస్సా ను ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఒక థ్రిల్లర్ జానర్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తవగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇలా ఈ కొత్త ప్రాజెక్టుపై వార్తలు రావడంతోనే బింబిసారా 2 గురించి అభిమానులు పలు ప్రశ్నలు వేస్తున్నారు.

బింబిసారా 2 ఆలస్యానికి కారణం

మరి ఈ బింబిసారా 2 ఆలస్యానికి గల కారణం ఏమిటి? అనే విషయానికొస్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కొంచెం డైలమాలో పడినట్టు కనిపిస్తోంది. టీం ఇంకా సరైన స్క్రిప్ట్ కోసం వెతుకులాటలోనే ఉన్నారట. పీరియాడిక్ ఫాంటసీ చిత్రం కాబట్టి ఫస్ట్ పార్ట్ ను మించి ఈ సినిమా కథను రూపొందించాలని టీం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కి ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ అవసరం. అందుకే ఈ సీక్వెల్ ను మరింత పటిష్టంగా కథను సిద్ధం చేసుకుని పట్టాలెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదని చెప్పవచ్చు. . మొత్తానికి అయితే బింబిసారా వన్ క్రియేట్ చేసిన హైప్ ని నిలబెట్టాలంటే కాస్త టైం పడుతుంది. ఇక ఆ సమయం వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

 

also read: Anupama Parameswaran: యంగ్ హీరోతో డేటింగ్ లో అనుపమ.. అఫిషియల్ చేసినట్టేనా?

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×