E-Paper
Advertisement

Portable AC vs Portable Air Cooler: రెండింటిలో ఏది బెస్ట్? బడ్జెట్, ఫీచర్లు, లాభనష్టాలు.. డిటైల్డ్‌గా తెలుసుకోండి!

Portable AC vs Portable Air Cooler: రెండింటిలో ఏది బెస్ట్? బడ్జెట్, ఫీచర్లు, లాభనష్టాలు.. డిటైల్డ్‌గా తెలుసుకోండి!
Advertisement

Portable AC vs Portable Air Cooler: సమ్మర్ వచ్చేయడంతో ఏసీలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అయితే వ్యక్తిగత అవసరాల కోసం కూడా ప్రస్తుతం మార్కెట్ లో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. పోర్టబుల్ ఏసీ (Portable AC), పోర్టబుల్ ఎయిర్ కూలర్ (Air Cooler) వేరియంట్లలో ఇవి లభిస్తున్నాయి. ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సముదాయాల్లో ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే రెండు ఏసీలు చూడటానికి ఒకేలా ఉన్న పనితీరు, ఫీచర్ల, రిజల్ట్స్ పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ మీ అవసరానికి ఏది సరిగ్గా సరిపోతుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

వర్కింగ్ స్టైల్

పనితీరు పరంగా పోర్టబుల్ ఏసీ, కూలర్ కు చాలా వ్యత్యాసం ఉంది. Portable AC రిఫ్రిజిరేషన్ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది. గదిలోని వేడిని పీల్చుకుని, కంప్రెషర్ ద్వారా చల్లబరుస్తుంది. వేడి గాలిని బయటకు పంపడానికి దీనికి ఒక ‘ఎగ్జాస్ట్ హోస్’ (Exhaust Hose) పైపు ఉంటుంది. అదే పోర్టబుల్ కూలర్ విషయానికి వస్తే అది ‘ఎవాపరేటివ్ కూలింగ్’ మీద పనిచేస్తుంది. నీరు లేదా ఐస్ ముక్కల ద్వారా గాలిని చల్లబరిచి బయటకు విడుదల చేస్తుంది.

ఫీచర్ల పరంగా తేడాలు..

Advertisement

పోర్టబుల్ ఏసీల్లో కూలింగ్ సామర్థ్యం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇవి గది ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. దీనితో పోలిస్తే ఎయిర్ కూలర్ పనితీరు కాస్త తక్కువనే చెప్పాలి. మరోవైపు పోర్టబుల్ ఏసీ.. గదిలోని తేమను తగ్గిస్తే కూలర్ దానిని పెంచుతుంది. మెయింటెనెన్స్ పరంగా చూస్తే ఏసీ కాస్త అనువైనది. కూలర్ అయితే రోజూ నీళ్లు నింపడం, ప్యాడ్స్ క్లీనింగ్ వంటివి చేస్తూ ఉండాలి. ఇక శబ్దం విషయానికి వస్తే ఫ్యాన్ వల్ల కూలర్ లో మోస్తరు శబ్దం వస్తుంది. దీనితో పోలిస్తే ఏసీలో అంతగా శబ్దం ఉండదు. ఇన్ స్టాలేషన్ పరంగా చూస్తే ఏసీకి సంబంధించిన ఎగ్జాస్ట్ పైపును కిటికీ బయటనే ఉంచాల్సి ఉంటుంది. దీని వల్ల ఏసీని ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడం కష్టం. అదే కూలర్ అయితే ఎక్కడికైనా తేలిగ్గా తీసుకెళ్లవచ్చు.

లాభనష్టాలు..

పోర్టబుల్ ఏసీ: ఇవి ఏ కాలంలోనైనా అద్భుతంగా పనిచేస్తాయి. గదిని వేగంగా చల్లబరుస్తాయి. అయితే పోర్టబుల్ ఏసీలు చాలా ఖరీదైనవి. విద్యుత్ బిల్లు సైతం అధికంగా వస్తుంటుంది. దీని వెనుక పైపు ఉండటం వల్ల ఒక చోటనే ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మార్కెట్ లో రూ.25,000-40,000 మధ్య పోర్టబుల్ ఏసీలు సేల్ అవుతున్నాయి.

Advertisement

పోర్టబుల్ కూలర్: ఇవి ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చేస్తాయి. ఏసీలతో పోలిస్తే విద్యుత్ బిల్లు కూడా పరిమితంగానే ఉంటుంది. పనితీరు పరంగా ఎండాకాలంలో మాత్రమే దీని సమర్థవంతమైన సేవలు అందిస్తుంది. తీర ప్రాంతాల్లో (Coastal areas) ఉక్కపోత ఉన్నప్పుడు దీని పనితీరు మందగిస్తుంది. ధర విషయానికి వస్తే పోర్టబుల్ కూలర్లు రూ.5000 నుంచి రూ.12,000 లోపు బడ్జెట్ లో లభిస్తున్నాయి.

Also Read: Washing Machine Tips: మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? ఈ తప్పులు చేయకండి.. చేశారో మర్నాడు షెడ్డుకే!

రెండింటిలో ఏది బెస్ట్?

సమ్మర్ లో అధిక చల్లదనం కోరుకునేవారు, బడ్జెట్ సమస్యలేని వారు నిరభ్యంతరంగా పోర్టబుల్ ఏసీని కొనుగోలు చేయవచ్చు. ఒక వేళ బడ్జెట్ పరిమితంగా ఉండి.. విద్యుత్ బిల్లు భయాలు ఉన్నట్లైతే పోర్టబుల్ కూలర్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. మీ అవసరం, అభిరుచికి అనుగుణంగా ఉన్న దానిని మీరే ఎంచుకోండి.

Also Read: Project Silica: 10000 సంవత్సరాల వరకు డేటాను భద్రపరిచే కొత్త చిప్.. 4TB గ్లాస్ చిప్ తయారు చేసిన మైక్రోసాఫ్ట్

Related News

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!

Big Stories

Advertisement
×