E-Paper
Advertisement

S.SRajamouli: జేమ్స్ కామెరూన్ తో రాజమౌళికి పోలిక.. జక్కన షాకింగ్ రియాక్షన్!

S.SRajamouli: జేమ్స్ కామెరూన్ తో రాజమౌళికి పోలిక.. జక్కన షాకింగ్ రియాక్షన్!
Advertisement

S.S rajamouli: : ఎస్ ఎస్ రాజమౌళి పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి(Rajamouli) డైరెక్షన్లో సినిమా వస్తుందంటేనే చాలు ఆ సినిమా పట్ల పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా గ్లోబల్ రేంజ్ లో కూడా అంచనాలు ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ లాంటి గొప్ప అవార్డును తెచ్చిన ఘనత రాజమౌళికి ఉందని చెప్పాలి. ఇప్పటివరకు ఈయన కెరియర్ లో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇలా ఎంతో నైపుణ్యం కలిగిన రాజమౌళిని ఇటీవల కాలంలో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ (James Cameron)తో పోలిస్తూ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

జేమ్స్ కామెరున్ గురువు.. నేను శిష్యుడినే..

ఇలా రాజమౌళిని హాలీవుడ్ దర్శక ధీరుడు జేమ్స్ కామరూన్ తో పోల్చడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అయితే ఈ పోలికలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేశారు. “జేమ్స్ కామెరున్ తో నన్ను నేను పోల్చుకోవడం అసాధ్యమని తెలిపారు. ఆయన ఎల్లప్పుడూ గురువు నేను కేవలం శిష్యుడిని మాత్రమే ఆయనతో నాకు పోలికలు అసాధ్యం” అంటూ రాజమౌళి స్పందించారు.

అవతార్ సినిమాతో వారణాసి పోలికలు..

Advertisement

ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వారణాసి (Varanasi)సినిమాని కూడా జేమ్స్ కామెరున్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ సినిమాతో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ పోలికలపై కూడా రాజమౌళి స్పందిస్తూ.. దర్శకుడు జేమ్స్ కామెరున్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచం అవతార్ సినిమాతో తన వారణాసి సినిమాను పోల్చడం చాలా గౌరవంగా భావిస్తున్నాను కానీ ఆయనతో మాత్రం నన్ను పోల్చవద్దు అంటూ ఈయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ప్రస్తుతం రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతే తెలిసిందే.

గ్లోబల్ స్థాయిలో వారణాసి విడుదల..

Advertisement

మొదటిసారి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి అయ్యిందని, మరొక ఐదు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని రాజమౌళి తెలియచేశారు. ఇక ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో 2027 ఏప్రిల్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవల అధికారకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు(Mahesh Babu)కు జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నారు అలాగే నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే గ్లోబల్ రేంజ్ లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఇలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Varanasi Film: వారణాసి రెండు భాగాలు కాదు..రన్ టైమ్ తో బయట పెట్టిన జక్కన్న!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×