E-Paper
Advertisement

Varanasi Film: వారణాసి రెండు భాగాలు కాదు..రన్ టైమ్ తో సహా బయట పెట్టిన జక్కన్న!

Varanasi Film: వారణాసి రెండు భాగాలు కాదు..రన్ టైమ్ తో సహా బయట పెట్టిన జక్కన్న!
Advertisement

Varanasi Film: టాలీవుడ్ దర్శక ధరుడు ఎస్ ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో వారణాసి(Varanasi) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా మరొక ఆరు ఏడు నెలలలో షూటింగ్ పూర్తి అవుతుందని స్వయంగా రాజమౌళి ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027 ఏప్రిల్ ఏడో తేదీ ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని రాజమౌళి అధికారకంగా తెలియచేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించడంతో రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారని చెప్పాలి.

రెండు భాగాలుగా వారణాసి?

సినిమా ప్రమోషన్లను నిర్వహించడంలో రాజమౌళి తర్వాతనే ఎవరైనా. ఈయన సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సైలెంట్ గానే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇటీవల రాజమౌళితో పాటు ప్రభాస్ ప్రియాంక చోప్రా తో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా వారణాసి సినిమాకి సంబంధించి ఎన్నో అంశాలను బయటపెట్టారు. ఇకపోతే ఇటీవల ప్రతి ఒక్క సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి వారణాసి సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇదివరకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

3 గంటల రన్ టైం…

Advertisement

వారణాసి సినిమా రెండు భాగాల గురించి రాజమౌళికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెబుతూ ఈ సినిమాకు ఓకే భాగం ఉంటుందని మరో భాగం లేదని క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా ఈ సినిమా రన్ టైం కూడా బయటపెట్టారు. ఈ సినిమా సుమారు 3 గంటల రన్ టైం ఉంటుందని రాజమౌళి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు రెండు భాగాలు రాబోతుందనే విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రమోషన్లకే వందల కోట్లు..

Advertisement

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు అలాగే ఈయన రాముడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా వారణాసి సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నారని ఇది వరకే విడుదల చేసిన టైటిల్ గ్లింప్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమాలో మైథాలజీ టచ్ కూడా ఉండబోతుందని సుమారు 25 నిమిషాల పాటు మైథాలజీ నేపథ్యంలో సినిమా ఉంటుందని రాజమౌళి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో రాజమౌళి సైతం ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఇప్పటినుంచి గ్లోబల్ రేంజ్ లో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసమే రాజమౌళి సుమారు 200 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.

Also Read; MSVPG OTT: ఓటీటీలోను మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్?

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×