E-Paper
Advertisement

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?
Advertisement

The Odyssey Movie:హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మన దేశంలో కూడా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసి ఘన విజయం దిశగా పయనిస్తోంది. అంతా బాగుందనుకునే లోపే ఈ చిత్ర యూనిట్ ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. రూ.2,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా నిర్మాతలు, కేవలం రూ.6 లక్షల బిల్లు చెల్లించలేదని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వైకింగ్ నౌక వివాదం.. అసలు ఏం జరిగింది?:

‘ది గార్డియన్’ కథనం ప్రకారం.. ఈ వివాదం ‘గ్లాడ్ ఆవ్ గిల్బెర్గా’ అనే వైకింగ్ నౌక చుట్టూ తిరుగుతోంది. వైకింగా లెడెన్ అసోసియేషన్‌కు చెందిన ఈ నౌకను సినిమాలో ప్రాచీన గ్రీకు యుద్ధ నౌకగా ఉపయోగించారు. క్రిస్టోఫర్ నోలన్ వంటి లెజెండరీ డైరెక్టర్ సినిమాలో తమ నౌక కనిపించబోతోందని అసోసియేషన్ నిర్వాహకులు ఎంతో సంబరపడ్డారు. కానీ షూటింగ్ పూర్తయ్యాక దెబ్బతిన్న స్థితిలో ఉన్న ఆ నౌకను తమకు అప్పగించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ:18 మంది వేద పండితులతో డైరెక్టర్ గోపీచంద్ ధన్వంతరి హోమం!

రూ.6 లక్షలు ఇవ్వడానికి మనసు రాలేదా?:

నౌక మరమ్మతులకు దాదాపు 6,000 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.5.79 లక్షలు) ఖర్చయ్యాయని వైకింగా లెడెన్ అసోసియేషన్ చైర్మన్ పీటర్ ఒలౌసన్ తెలిపారు. “మేము కార్మికుల కూలీ కూడా అడగడం లేదు, కేవలం రిపేర్లకు వాడిన సామగ్రి ఖర్చు మాత్రమే కోరుతున్నాం. ఇక వేల కోట్ల బడ్జెట్ ఉన్న యూనివర్సల్ పిక్చర్స్ సంస్థకు 6,000 డాలర్లు ఒక పెద్ద లెక్క కాదు. కానీ ఏడాది గడిచినా మమ్మల్ని పూర్తిగా పక్కన పడేయడం బాధాకరం” అని పీటర్ పేర్కొన్నారు.

ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదా?:

Advertisement

షూటింగ్ కంటే ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నౌకకు ఏమైనా డ్యామేజ్ అయితే తామే రిపేర్ చేయించుకుంటామని, ఆ ఖర్చును నిర్మాతలు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఒలౌసన్ వెల్లడించారు. ఇక ఇప్పటికే తమ సొంత ఖర్చులతో నౌకను బాగుచేసి మళ్లీ వాడకంలోకి తెచ్చినా, హాలీవుడ్ నిర్మాణ సంస్థ నుంచి రావాల్సిన డబ్బు మాత్రం ఇంకా రాలేదని అసోసియేషన్ వాదిస్తోంది.

ఆరోపణలను ఖండించిన యూనివర్సల్ పిక్చర్స్:

అయితే ఈ వివాదంపై నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ వెంటనే స్పందించింది. వైకింగ్ అసోసియేషన్ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించింది. నౌకకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను, మరమ్మతుల ఖర్చులతో సహా క్లియర్ చేశామని స్పష్టం చేసింది. ఇంకా ఏవైనా అనుమానాలు లేదా పొరపాట్లు ఉంటే వాటిని మాట్లాడి పరిష్కరించుకోవడానికి అసోసియేషన్‌తో చర్చలు జరుపుతున్నామని నిర్మాణ సంస్థ ప్రతినిధి తెలిపారు.

నిజమేంటో తేలాల్సి ఉంది:

కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న ఒక భారీ సినిమాకు, కొన్ని లక్షల రూపాయల రిపేర్ ఖర్చుల విషయమై ఇలాంటి వివాదం ఎదురవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో ఉన్న వార్తల్లో నిర్మాణ సంస్థ పొరపాటు ఉందా లేక అసోసియేషన్ వైపు నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

Related News

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

18 మంది వేద పండితులతో డైరెక్టర్ గోపీచంద్ ధన్వంతరి హోమం!

పూరీ జగన్నాథ్ దారుణంగా మోసపోయాడు.. నిజాలు బయటపెట్టిన రఘు కుంచె!

పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పవిత్ర!

మెగా ఫ్యాన్స్ కి షాక్.. రామ్ చరణ్ కు సర్జరీ..?

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తల్లైన అయిన ‘శీను వాసంతి లక్ష్మీ’ బ్యూటీ!

పదహారేళ్లకే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. అప్పుడే షూటింగ్ పూర్తి!

Big Stories

Advertisement
×