Director Gopichand:ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో NBK 111 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్టులో జరుగుతున్న సమయంలో బాలకృష్ణ యాక్షన్ స్టంట్ చేస్తూ సడన్గా కాలుజారి కింద పడ్డారు. ఆయన కాలుకి తీవ్రంగా గాయం అవడంతో ఇటీవల హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ వైద్య బృందం సుమారుగా 3 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఏ ఐ జి హాస్పిటల్ బృందం వెల్లడించిన విషయం తెలిసిందే.
ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. బాలయ్య త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. NBK 111 డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలకృష్ణ ఆరోగ్యం కోసం.. బెంగళూరులోని హుస్కూర్ , కంబలిపురలో ఉన్న కాటేరమ్మ ఆలయంలో జూలై 26న మహాయాగంతో పాటు ధన్వంతరి హోమం నిర్వహించారు. ఈ పూజలో సుమారుగా 18 మంది వేద పండితులు పాల్గొని హోమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ పూజలో గోపీచంద్ మలినేనితో పాటు బాలయ్య వీరాభిమానులైన ఎన్.బి.కె హెల్పింగ్ హాండ్స్ అనంతపురం జగన్ , అలాగే మరికొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హోమం దిగ్విజయంగా పూర్తి చేసిన నేపథ్యంలో బాలయ్య వీరాభిమాని ఎన్.బి.కె హెల్పింగ్ హాండ్స్ అనంతపురం జగన్ తో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కాటేరమ్మ దేవాలయ కమిటీ అర్జున్ కి ధన్యవాదాలు తెలియజేశారు.
ALSO READ:పూరీ జగన్నాథ్ దారుణంగా మోసపోయాడు.. నిజాలు బయటపెట్టిన రఘు కుంచె!
ఇదిలా ఉండగా.. మరోవైపు అందుతున్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణ ఈ రోజు లేదా రేపు డిస్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకి కొన్ని వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. ఈ నేపథ్యంలోనే షూటింగ్ ఆగిపోయే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. బాలయ్య మాత్రం షూటింగ్ పూర్తిగా నిలిపివేయకుండా.. తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తాత్కాలికంగా నిలిపివేసి, మిగిలిన నటీనటులతో షూటింగ్ కొనసాగించాలని గోపీచంద్ తో చెప్పినట్లు సమాచారం. అయితే ఈ గాయం ప్రభావం సినిమా విడుదల తేదీ పై పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మరొకవైపు బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కార్పెంటర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బాలకృష్ణ త్వరగా రికవరీ అయ్యి మళ్ళీ సినిమా షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.