E-Paper
Advertisement

అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు?.. బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!

అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు?.. బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!
Advertisement

Ponnam Prabhakar: స్వేచ్ఛ బ్యూరో: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సాకుగా చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఒక్కరోజులో ఏర్పడినవి కావని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భారీగా పేరుకుపోయిన వారసత్వ సమస్య అని ఆయన గుర్తు చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్..

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు బకాయిలు పెడుతున్న సమయంలో రామచంద్రరావు ఎందుకు మౌనం వహించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ, దేశంలో తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడ ఈ పథకాన్ని అమలు చేస్తుందో స్పష్టం చేయాలని మంత్రి సవాల్ విసిరారు. విద్యార్థుల సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, కనీసం రాష్ట్రాలపై ఉన్న ఆర్థిక భారాన్ని పంచుకుంటూ కేంద్రం కూడా తన వంతు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో నాటకాలు..

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించాలని చేసిన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. ఆ అంశంపై సమాధానం చెప్పకుండా దృష్టి మళ్లించేందుకే బీజేపీ నాయకులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే వయోపరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇస్తుందా? లేదా? అనే విషయాన్ని రామచంద్రరావు స్పష్టంగా చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

బీజేపీ మద్దతు ఇస్తుందా..? వ్యతిరేకిస్తుందా..?

విద్యార్థి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయంతో ఉందన్నారు. ఈ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో వెల్లడించాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలకు బీజేపీ మద్దతు ఇస్తుందా? లేదా వ్యతిరేకిస్తుందా? అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు .పరీక్ష పేపర్ల లీకేజీ తో విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్న బీజేపీకి విద్యార్థుల గురించి ప్రశ్నించే కనీస నైతిక అర్హత లేదన్నారు.

Also Read: నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

Related News

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

Big Stories

Advertisement
×